Husband: రక్షించండి మహాప్రభో.. నా భార్య, బావమరిది చంపేస్తామంటున్నారు.. రైల్వే ఉద్యోగి ఆవేదన

సుమిత్ కుమార్ అనే వ్యక్తి రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అయితే, తన ఉద్యోగమే తన పాలిట శాపంగా మారిందని సుమిత్‌ కుమార్‌ వాపోయాడు. ఆ ఉద్యోగం కోసం భార్య, బావమరిది తనపై భౌతిక దాడికి పాల్పడుతున్నారని పోలీసులను ఆశ్రయించాడు. తనను చంపడానికి వారు ప్లాన్ చేస్తుండగా.. సుమిత్ విన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Husband: రక్షించండి మహాప్రభో.. నా భార్య, బావమరిది చంపేస్తామంటున్నారు.. రైల్వే ఉద్యోగి ఆవేదన
Loco Pilot Alleges Wife

Updated on: Apr 20, 2025 | 9:38 PM

ఇటీవల కాలంలో భార్యా బాధితుల సంఖ్య ఎక్కువైంది. దారుణంగా భర్తలు భార్య చేతిలో హత్యకు గురవుతున్నారు. అయితే తాజాగా ఓ భర్త తనను చంపేస్తామంటూ భార్య, బావమరిది బెదిరిస్తున్నారని పోలీసులను ఆశ్రయించాడు. మీరట్ హత్య కేసులో భర్త మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్‌లో నింపిన పరిస్థితి తనకూ ఎదురవుతుందని హెచ్చరిస్తూ, తన భార్య, బావమరిది హత్య బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఒక లోకో పైలట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని గయాకు చెందిన సుమిత్ కుమార్ అనే వ్యక్తి రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అయితే, తన ఉద్యోగమే తన పాలిట శాపంగా మారిందని సుమిత్‌ కుమార్‌ వాపోయాడు. ఆ ఉద్యోగం కోసం భార్య, బావమరిది తనపై భౌతిక దాడికి పాల్పడుతున్నారని పోలీసులను ఆశ్రయించాడు. తనను చంపడానికి వారు ప్లాన్ చేస్తుండగా.. సుమిత్ విన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..