Watch: నీళ్లను చూడగానే అమాంతం ఎగిరిన గున్న ఏనుగు.. ఆ తర్వాత జరిగింది చూస్తే

ఈ చిన్న ఏనుగు అమాయకమైన, ఫన్నీ ప్రయత్నం ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ వీడియోను 55 వేలకు పైగా వీక్షించారు. వేలాది మంది దానిపై లైక్ చేయడం, కామెంట్ చేయడం ద్వారా ప్రజలు తమ జంతుప్రేమను వ్యక్తం చేశారు. చిన్న ఏనుగు, అమాయకత్వం, సరదాగా నిండిన చేష్టలు ఇంటర్నెట్‌లో అందరి హృదయాలను గెలుచుకున్నాయి.

Watch: నీళ్లను చూడగానే అమాంతం ఎగిరిన గున్న ఏనుగు.. ఆ తర్వాత జరిగింది చూస్తే
Little Elephant In Water

Updated on: Aug 04, 2025 | 2:00 PM

సోషల్ మీడియాలో తరచూ అడవి జంతువుల వీడియో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ఇంటర్నెట్‌లో ఒక గున్న ఏనుగు అందమైన వీడియో ప్రజల్ని ఆకట్టుకుంటోంది. అందులో ఒక చిన్న ఏనుగు పిల్ల నీటిలోకి దూకి తన సహచరుడితో కలిసి ఆడుకుంటున్న దృశ్యం కనిపించింది. ఏనుగు పిల్ల ఈ క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ప్రజలు కూడా వీడియోని లైక్‌ చేశారు. కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఏనుగు పిల్ల ఎంత ప్రశాంతంగా కనిపించినా, అవి స్వభావరీత్యా అంతే ఉల్లాసభరితంగా ఉంటాయి. అవి దూకడం, గెంతడం వంటి చిలిపిపనులు కూడా ఎక్కువగా చేస్తుంటాయి. ఏనుగు ప్రశాంతంగా నిద్రపోతాయి. లేదంటే అక్కడక్కడ ఆడుకుంటూ తరచూ ఇంటర్‌నెట్‌లో కనిపిస్తూ ఉంటాయి. అటువంటిదే బురద నీటిలోకి దూకే పిల్ల ఏనుగు అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో, ఒక చిన్న ఏనుగు పిల్ల నీటిలో ఈతకొట్టేందుకు ఉత్సహంగా దూకుతోంది. దాని రెండు కాళ్ళతో నీటిలోకి దూకడానికి ప్రయత్నిస్తుంది. ఇది చూడటానికి చాలా సరదాగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

టస్కర్ షెల్టర్ అనే పేజీ ఈ అందమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో, ఒక పిల్ల ఏనుగు తన రెండు కాళ్లతో నిస్సారమైన నీటిలోకి దూకడానికి ప్రయత్నిస్తుంది. కానీ, పాపం దానికి బ్యాలెన్స్‌ కంట్రోల్‌ కాకపోవడంతో నేరుగా బురదలో పడిపోతుంది. ఈ చిన్న ఏనుగు అమాయకమైన, ఫన్నీ ప్రయత్నం ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. ఏనుగు పిల్ల ఎంతో ఉత్సాహంగా దూకుతున్నప్పుడు దాని ఆనందం, శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, తరువాత అది అకస్మాత్తుగా జారిపడి బురదలో పడిపోతుంది. ఇది కూడా చూసేందుకు కాస్త చిలిపిగానే కనిపిస్తుంది. ఏనుగు పిల్ల దూకడం, అమాయకంగా జారడం వీక్షకులను నవ్వించాయి. చూసే వారిని రంజింపజేశాయి.

ఈ వీడియోను @tuskershelter అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. ఈ వీడియోను 55 వేలకు పైగా వీక్షించారు. వేలాది మంది దానిపై లైక్ చేయడం, కామెంట్ చేయడం ద్వారా ప్రజలు తమ జంతుప్రేమను వ్యక్తం చేశారు. చిన్న ఏనుగు, అమాయకత్వం, సరదాగా నిండిన చేష్టలు ఇంటర్నెట్‌లో అందరి హృదయాలను గెలుచుకున్నాయి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి