
చేపలు పట్టడం అంత సులభమైన పని కాదు. దానికి సరైన ఉపాయం, నైపుణ్యం అవసరం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. మీరు అవాక్కవడం ఖాయం. తన నైపుణ్యంతో చేపలు పడుతూ బుడ్డోడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాడు. చిన్న వయసులోనే అతడి అద్భుతమైన టాలెంట్‌కు అంతా ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోలో 8-9 ఏళ్ల వయసున్న ఒక పిల్లవాడు పెద్ద చెరువు ఒడ్డున ఒక చిన్న వలతో నిలబడ్డాడు. చిన్నోడు కాబట్టి అతనికి చేపలు పడడం కష్టమే అని అనుకుంటారు అంతా.. అయితే అతను వలను పూర్తి పరిపూర్ణతతో నీటిలోకి విసిరిన విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తర్వాత అతను నెమ్మదిగా వలను నీటిలోంచి బయటకు తీయగానే.. అందులో బోలెడన్ని చేపలు కనిపించాయి. ఆ పిల్లవాడి ప్రతిభ, చేపలతో పాటు బయటపడింది.
ఆ పిల్లవాడి ముఖంలో ఉన్న విశ్వాసం, కళ్లలో మెరుపు, పెదవులపై అమాయక చిరునవ్వు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంత చిన్న వయసులో పిల్లలలో ఇంత అద్భుతమైన టాలెంట్, నైపుణ్యం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో @martinezzuritajorgeluis అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకు అద్భుత స్పందన లభించింది. ఈ వీడియోను ఇప్పటివరకు 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 470,000 కంటే ఎక్కువ మంది దీనిని లైక్ చేశారు. కొందరు నెటిజన్లు.. “ఈ పిల్లాడు ఫోన్‌లో టైం వేస్ట్ చేయకుండా నిజమైన జీవితాన్ని గడుపుతున్నాడు” అని మెచ్చుకున్నారు. ఇంకొందరు, “ప్రకృతితో మంచి సంబంధం పెట్టుకున్నాడు” అని కామెంట్ చేశారు.