Viral Video Update: సోషల్ మీడియాలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వారి ముద్దు ముద్దు మాటలకు, చిలిపి చేష్టలకు జనాలు ఫిదా అవుతుంటారు. ఇలా ఎన్నో అందమైన, క్యూట్ వీడియోలు నెట్టింట్లో వైరల్ హల్చల్ చేస్తుంటాయి. వాటికి మిలియన్ వ్యూస్ లభిస్తాయి. ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసేక మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. ఇది ఖచ్చితంగా నిజం. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.
ఈ వీడియోలో ఓ చిన్నారి తెలిసి తెలియక చేసిన పని చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ పిల్లాడు కేక్ తయారు చేయడం కోసం ఓ గిన్నె నిండా పిండి పెట్టుకుంటాడు. ఇక అతడి పక్కనే ఉన్న మరో గిన్నె నుంచి ఫ్లౌర్ చిన్న స్పూన్‌తో తీసుకుని వేయబోతుండగా.. అది కాస్తా ఆ చిన్నారి ముఖంపై పడుతుంది. ఇంకేముంది బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తాడు. ఇక అతడి స్వచ్చమైన తీరును చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న ఈ బుడతడి వీడియో షేర్ చేసిన కొద్దిసేపటిలోనే నెట్టింట్లో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో, ఈ వీడియోను ‘ఫ్రెడ్ షుల్ట్జ్’ అనే యూజర్ షేర్ చేశారు. దీనికి ‘వెల్‌కమ్ టు ఫ్లేవర్ టౌన్’ అనే ఫన్నీ క్యాప్షన్‌లో ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 6 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
Welcome to Flavor Town.??? pic.twitter.com/WO5cHe4SK1
— Fred Schultz (@fred035schultz) April 6, 2021
Also Read:
Viral: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.
ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!
Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుద్దోడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!