Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..

|

Mar 28, 2022 | 9:53 AM

Fight Between Crocodile and Lioness: సింహాన్ని ఎవరూ అడవికి రాజును చేయలేదు.. తనకు తానే కీకారణ్యానికి రారాజుగా ప్రకటించుకుంది. ఆ అడవిలో శక్తివంతమైన జంతువు సింహమే.. అయితే సింహం  కంటే తామేం..

Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..
Lioness
Follow us on

సింహాన్ని ఎవరూ అడవికి రాజును చేయలేదు.. తనకు తానే కీకారణ్యానికి రారాజుగా ప్రకటించుకుంది. ఆ అడవిలో శక్తివంతమైన జంతువు సింహమే.. అయితే సింహం (Lions) కంటే తామేం తక్కువ కాదంటూ కొన్ని సార్లు మిగిలిన జంతువులను మనం చూస్తూ ఉంటాం. వేటలో సింహాలకు మించినది లేదు. తాజాగా ఆ సింహాల వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మొసళ్ల గుంపుతో(Crocodiles) సింహాల జంట పోరాడుతున్నట్లుగా మనం చూడచ్చు. అవి ఆ నీటిని దాటాలని ప్రయత్నిస్తుంటే మొసళ్లు పెద్ద ఎత్తున అడ్డుకోవడం మనం చూడవచ్చు. వాటి లక్ష్యం ఒక్కటే అన్నట్లుగా కనిపిస్తుంది. అడవిలో ఎవరై సింహం బాధితురాలిగా మారొద్దు.. అనే ఏదైన ఉద్యమం మొదలు పెట్టినట్లుగా ఒకే సారి పెద్ద ఎత్తున మొసలి గుంపు నిరసన తెలుపుతూ పోరాడటం మనం ఈ వీడియోలో చూడవచ్చు. జింకలు, గేదెలు, జీబ్రా, పిల్ల ఏనుగు, ఖడ్గమృగం, హిప్పోపొటామస్, అడవి పంది, మొసలి, జిరాఫీ ఇలా అడవిలోని ప్రతి జంతు కుటుంబం సింహం బాధితులే. అయితే ఇలా  సింహాల వేట జాబితాలో చిక్కుకున్న తమ జాతిని రక్షించుకునేందుకు ఇలా పోరాడుతున్నాయేమో అని పిస్తుంది ఈ దృశ్యం. తాజాగా నీటిలో మునిగిన మొసళ్ల గుంపుతో సింహం పోరాడుతూ కనిపించింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి వైల్డ్_యానిమల్_షార్ట్‌ల వీడియో భాగస్వామ్యం చేయబడింది.

మొసలి బృందంతో సింహం పోరాటం, వైరల్ వీడియో చూడండి..

నిజానికి జంతువులకు రారాజు సింహం అయినప్పటికీ ఇంటిపనులు చేయడంలో చాలా బద్ధకంగా ఉంటాయి. ఇటీవ‌ల వైర‌ల్ అయిన వీడియోలోనూ ఇదే విష‌యం క‌నిపిస్తోంది. అయితే సింహంతో పాటు మరో సింహం కూడా కనిపిస్తుంది. రెండ్రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన వెంటనే రెప్పపాటులో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో వీక్షణలు, లైక్‌లు, కామెంట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వీడియోలో కనిపిస్తున్నట్లుగా, మొసళ్లు ఉన్న చెరువులో అంతగా నీరు లేదు. ఒక సింహం మొసలి వైపు కదులుతోంది. సింహం చెరువు ఒడ్డున కూర్చుని తీక్షణంగా గమనిస్తోంది. అయితే, అది నీటిలోకి ప్రవేశించలేదు. సింహం చాలా మొసళ్ళతో నీటిలోకి దిగి నేరుగా ముందుకి వెళ్ళింది. అది ఎంత రౌడీలా అరిచి గీ పెట్టినా.. మొసళ్లు కూడా ఆత్మరక్షణ కోసం పదునైన పళ్లతో ముందుకు సాగడం మనం చూడవచ్చు. అయితే మొసలి బృందంతో సింహం గట్టిగానే పోరాడినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ఆత్మరక్షణలో మొసళ్లు కూడా హింసాత్మకంగా మారాయి. కానీ సింహాని వదలడానికి పెళ్లికూతురు కాదు. తొలుత వెనక్కి తగ్గినా చివరి క్షణంలో వీరోచితంగా ముందుకు సాగాయి.

ఇవి కూడా చదవండి: Yadadri Temple: మరికాసేపట్లో భక్తులకు యాదాద్రి నృసింహుడి నిజరూప దర్శనం.. తొలి భక్తునిగా సీఎం కేసీఆర్ ..

BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఏపీ, తెలంగాణల్లో యూపీ ఫార్ములా..