Viral Video: మృగరాజు, గజరాజు మధ్య పోట్లాట.. చివరికి ఏమైందంటే..

|

Apr 08, 2022 | 5:36 PM

Viral News: సాధారణంగా సింహాలను అడవికి రాజుగా భావిస్తారు. ఆకలితో ఉంటే ఎలాంటి జంతువులనైనా అవి వేటాడేస్తాయి. అలా ఆహారం కోసం అడవిలో గాలిస్తోన్న ఓ సింహానికి ఒక చిన్న ఏనుగు కనిపించింది.

Viral Video: మృగరాజు, గజరాజు మధ్య పోట్లాట.. చివరికి ఏమైందంటే..
Follow us on

Viral News: సాధారణంగా సింహాలను అడవికి రాజుగా భావిస్తారు. ఆకలితో ఉంటే ఎలాంటి జంతువులనైనా అవి వేటాడేస్తాయి. అలా ఆహారం కోసం అడవిలో గాలిస్తోన్న ఓ సింహానికి ఒక చిన్న ఏనుగు కనిపించింది. ఎలాగైనా దాన్ని వేటాడి తన కడుపునింపుకోవాలనుకుంది. అంతే వెంటనే దానిపైకి దుమికింది. ఏనుగు చెవిని నోటితో పట్టుకుని కొంతసేపు వేలాడింది. ఆ తర్వాత ఏనుగుపైకి ఎక్కి దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ గజరాలు బాధతో విలవిల్లాడిపోయింది. అయితే మృగరాజు బారి నుంచి తనను తాను ఎలాగైనా రక్షించుకోవాలనుకుంది. అంతే ఏనుగు ఒక్కసారిగా బలంగా సింహాన్ని విదిలించి కొట్టింది. దాంతో సింహం పట్టు కోల్పోయింది. ఇలా సింహం బారినుంచి ఏనుగు తప్పించుకుని పొదల్లోకి పారిపోయింది. సఫారీకి వెళ్లిన ఓ వైల్డ్‌ ఫొటోగ్రాఫర్‌కు ఈ సింహం, ఏనుగు పోట్లాట కనిపించింది. వెంటనే ఆ దృష్యాన్ని తమ కెమెరాలో బంధించాడు. ఆతర్వాత లైఫ్‌ అండ్‌ నేచర్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది.

సాధారణంగా సింహాలు, ఏనుగులు సహజ విరోధులు. అందుకే సింహాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఏనుగులను వేటాడుతుంటాయి. ఎక్కువగా ఆడ సింహాలే ఏనుగులను వేటాడినప్పటికీ, మగ సింహాలు తక్కువేం కాదు. పైగా ఆడవాటికంటే మగ సింహాలు 50 శాతం ఎక్కువ బరువుండి బలిష్ఠంగా ఉంటాయి. ఆరేడు సింహాలు కలిసి ఒక ఏనుగును వేటాడగలవు. అయితే రెండు మగ ఏనుగులు కూడా ఈ పనిచేయగలవు. ఇక చిన్న ఏనుగుకైతే ఒక మగ సింహం సరిపోతుంది.

Also Read: Viral Video: ట్రాలీ నుంచి కిందపడబోయాడు.. కానీ కారు డ్రైవర్ దేవుడిలా వచ్చాడు..!

India – Ukraine: అలాంటి దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.. కైవ్ హత్యలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్

Viral: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి.. తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో అంతా కొలాప్స్