బిడ్డా జర చూస్కో.! గుడికి కాపలాగా సింహం.. తేడా వస్తే దబిడి దిబిడే!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ట్రెండ్‌ నడుస్తోంది. మన కళ్ళను మనమే నమ్మలేకపోతున్నాం. ఏది రియల్‌.. ఏది ఫేక్‌ తేల్చుకోవడం కష్టంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సోషల్ మీడియాలో మృగరాజుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేస్తుంది

బిడ్డా జర చూస్కో.! గుడికి కాపలాగా సింహం.. తేడా వస్తే దబిడి దిబిడే!
Lion Sitting In Front Of Temple

Updated on: Oct 04, 2025 | 12:50 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ట్రెండ్‌ నడుస్తోంది. ఏది రియల్‌.. ఏది ఫేక్‌ తేల్చుకోవడం కష్టంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సోషల్ మీడియాలో మృగరాజుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేస్తుంది. అందులోనూ శరన్నవరాత్రుల సమయం.. దివ్యకాంతులతో వెలుగుతున్న ఆలయం వద్ద కమనీయ దృశ్యం కనిపించింది. దుర్గాదేవి ఆలయానికి మృగరాజు కాపాలాగా ఉన్న దృశ్యం కనిపించింది. దీంతో ఒక్కసారిగా ‘మా దుర్గ’ అన్న నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు స్థానిక జనం.

రాత్రి చీకటిగా ఉంది. అడవిలో చాలా దూరంలో ఒక ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. అడవిలో తిరుగుతు తిరుగుతూ.. ఆ సింహం అమ్మవారి ఆలయం ముందుకు వచ్చింది. ఆలయం మెట్ల ముందు ప్రశాంతంగా కూర్చుంది. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వీడియో చూడండి.. 

IFS అధికారి పర్వీన్ కస్వాన్ తన సోషల్ మీడియా X హ్యాండిల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, ఒక సింహం దర్జాగా.. ఆలయం ముందు నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. వీడియోను పోస్ట్ చేస్తూ, పర్వీన్, “ఎంత అద్భుత దృశ్యం! ఆలయం కాపలా కాస్తున్నట్లు కనిపిస్తోంది” అని రాశారు.

ఈ సంఘటన గుజరాత్‌లోని గిర్ అడవిలోని దూరంగా ఉన్న ఒక ఆలయంలో జరిగింది. అడవిలో గస్తీ తిరుగుతుండగా, ఆ సింహం వెళ్లి ఆలయం ముందు కూర్చుంది. కూర్చుని తోక ఊపుతూ.. ఆ ఆలయానికి రక్షణగా ఉన్నాను అన్నట్లుగా కనిపించింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే అటవీ ప్రాంతంలో తిరిగే సింహాలు మానవులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందనలు తెలియజేస్తున్నారు. “ఆలయంలో మంచి భద్రతా సిబ్బంది ఉన్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు” అని రాశారు. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది తమ సందేహాలను వ్యక్తం చేయడానికి వెనుకాడలేదు. అలాంటి సంఘటన నిజంగా జరిగి ఉండకపోవచ్చు అని వారు వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధస్సు సహాయంతో ఈ వీడియోను రూపొందించారని వారు పేర్కొన్నారు. కాగా, భారతదేశంలో సింహాల జనాభా 2020లో 674 కాగా, 2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 70 శాతంపైగా సింహాల సంఖ్య పెరిగిందని ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..