Viral Video: బోనులో సింహంతో పరచకాలు.. నన్నే టచ్ చేస్తావా అంటూ రెచ్చిపోయిన మృగరాజు..

|

Feb 12, 2022 | 7:59 PM

కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే ఏం అవుతుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది...

Viral Video: బోనులో సింహంతో పరచకాలు.. నన్నే టచ్ చేస్తావా అంటూ రెచ్చిపోయిన మృగరాజు..
Lion
Follow us on

కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే ఏం అవుతుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి జూకు వెళ్లాడు. వెళ్లినవాడు జాగ్రత్తగా జంతువులు చూసి బయటకు రావాలి. కానీ అతడు చేసిన గాయపడాల్సి వచ్చింది. బోనులో ఉన్న సింహాన్ని రెచ్చగొట్టిన ఓ వ్యక్తి దాని ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే అతడి చేతిని నోటిలో పెట్టుకొని అతన్ని లోపలికి లాగింది.

సౌతాఫ్రికాలోని సెనెగల్ ప్రాంతానికి చెందిన ఓ జూ పార్కుకు ఓ వ్యక్తి వెళ్లాడు. అక్కడ జూలో ఉన్న సింహం ముందు నిల్చున్నాడు. ఆ సమయంలో సింహం దాని పని అది చేసుకుంటూ ఉంది. అదే సమయంలో సింహాన్ని తాకేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. నన్నే టచ్ చేస్తావా అంటూ సింహం వెంటనే ఆ వ్యక్తి చేతిని నోటితో కరుచుకుని లోపలికి లాగేందుకు ప్రయత్నించింది. అప్పుడు అతను కేకలు వేయడంతో అక్కడున్న వారు రాళ్లు రువ్వారు. కానీ సింహం ఏ మాత్రం బెదరలేదు.

కానీ, కొన్ని సెకన్ల తర్వాత అతడి చేతిని సింహం వదిలేసింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లో ఈ పోస్ట్‌కు 70,335కు పైగా వ్యూస్ వచ్చాయి.

Read Also.. Viral Photo: ఈ ఫోటోలో హచ్‌ డాగ్‌ నక్కి నక్కి చూస్తోంది.. ఎక్కడుందో కనిపించిందా.?