Leopard Hunts Dog: ఇంటి బయట పడుకున్న కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. షాకింగ్ వీడియో..

|

Jun 12, 2021 | 11:29 AM

Leopard Hunts Pet Dog: దేశంలో ఇటీవల కాలంలో తరచూ చిరుత పులుల దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌లో ఇంటిబయట

Leopard Hunts Dog: ఇంటి బయట పడుకున్న కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. షాకింగ్ వీడియో..
Leopard Hunts Pet Dog
Follow us on

Leopard Hunts Pet Dog: దేశంలో ఇటీవల కాలంలో తరచూ చిరుత పులుల దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌లో ఇంటిబయట ఆడుకుంటున్న చిన్నారిని సైతం చిరుత ఎత్తుకెళ్లి పొట్టన బెట్టుకుంది. అటవీ ప్రాంతంలోని పరిసరాల్లో పశువులపై కూడా దాడి సంఘటనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఓ చిరుతపులి నేరుగా ఇంటికి వచ్చి.. బయట పడుకున్న కుక్కును ఎత్తుకెళ్లింది. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాషిక్‌ సమీపంలో ఉన్న భూసె గ్రామంలో జరిగింది.

అర్ధరాత్రి వేళ భూసే గ్రామంలోని ఓ ఇంటి ముందు పడుకున్న పెంపుడు కుక్కను.. చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. వాస్తవానికి కొంచెం అలికిడి జరిగినా కుక్కలు వెంటనే మేల్కోంటాయి. అలాంటి కుక్క ఆ ప్రమాదాన్ని గ్రహించే లోపే చిరుత దాడి చేసి నోట కరుచుకుని తీసుకెళ్లింది. ఈ సంఘటన అంతా ఆ ఇంటికి పరిసరాల్లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది.
ఇంకెందుకు ఆలస్యం వీడియోను చూడండి..

Also Read:

Mehul Choksi: ‘వాటిని పరిగణలోకి తీసుకోం’.. మెహుల్‌ చోక్సీకి బెయిల్ నిరాకరించిన డొమినికా కోర్టు

TV9 Impact: మూడేళ్ల చిన్నారి ప్రాణం నిలిపిన ఇంజక్షన్‌ ఖరీదు 16 కోట్లు.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అపన్న హస్తం అందించిన దాతలు