Viral Video: పొదల మాటున నక్కి ఉన్న చిరుత.. ఒక్క ఉదుటున జింకపై దూకింది.. అంతలోనే ఊహించని ట్విస్ట్..

Viral Video: సింహాలు, పులులు, చిరుతపులులు అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటి అని మనందరికీ తెలిసిందే. రెప్పపాటులో అవి తమ వేటను పూర్తి చేసి తమ ఆకలిని తీర్చుకుంటాయి.

Viral Video: పొదల మాటున నక్కి ఉన్న చిరుత.. ఒక్క ఉదుటున జింకపై దూకింది.. అంతలోనే ఊహించని ట్విస్ట్..
Leopard
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 22, 2021 | 10:41 AM

Viral Video: సింహాలు, పులులు, చిరుతపులులు అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటి అని మనందరికీ తెలిసిందే. రెప్పపాటులో అవి తమ వేటను పూర్తి చేసి తమ ఆకలిని తీర్చుకుంటాయి. వాటి శక్తి ముందు మిగతా జంతువుల శక్తి దిగదుడుపే. అంత భయంకరంగా ఉంటుంది వాటి వేట. తాజాగా ఓ చిరుత పులి వేటకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఒక్క క్షణ మీరు నిర్ఘాంతపోవడం ఖాయం.

అడవిలో జీవించే జీవి బతుకు దినదిన గండం అన్నట్లుగానే కొనసాగుతుంది. ఎందుకంటే ఏ వైపు నుంచి ఏ క్రూర మృగం వచ్చి.. సాధారణ జంతువులను వేటాడి చంపుతాయో తెలియదు. అందుకే అడవిలో జీవించే ప్రతీ జీవి చాలా అప్రమత్తంగా ఉంటుంది. పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టి ప్రాణాలతో బయటపడుతుంది. కాదని ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. వాటికదే చివరి రోజు అవుతుంది. అయితే, అడవిలో ఒక చిరుతపులి.. జింకపై ఎంత భయంకరంగా దాడి చేసిందో.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో.. చెరువు నీటిలో జింక హాయిగా నిలబడి ఉంది. అయితే, అప్పటికే పెను ప్రమాదం చిరుత రూపంలో మాటు వేసి ఉంది. జింక ఆ ప్రమాదాన్ని పసిగట్టింది. ఓ కంట పరిసరాలను గమనిస్తూనే.. మరోవైపు నీరు తాగుతోంది. అయితే, పొదల మాటున దాగిన చిరుత.. ఒక్క ఉదుటున జింకపై దూకింది. జింకను తన పంజాతో అటాక్ చేసింది. అయితే, అప్పటికే అలర్ట్‌గా జింక.. తన కాళ్లకు పని చెప్పి.. వేగంగా పరుగెత్తి ప్రాణాలను రక్షించుకుంది. అయితే చిరుత మాటు వేసిన విధానం, వేటాడిన విధానం ఈ వీడియోలో భయంకరంగా ఉంది.

ఈ షాకింగ్ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సాకేత్ బడోలా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘ప్రమాదం ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా రావచ్చు. అందుకే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిని చూసి షాక్ అయ్యారు. లైక్స్, కామెంట్స్‌‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఈ వీడియో చూసిన తరువాత గూస్‌బంప్స్‌ వచ్చాయి’ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.

Viral Video:

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..