Video Viral: ఈ నదిలో ప్రవహించేది నీరు కాదు.. వేగంగా పరుగులు తీస్తూ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

|

Jul 27, 2022 | 4:18 PM

నదులు (River) అంటే మనందరికీ తెలిసిందే. వాటిలో దిగి ఈతకొట్టడం, సరదాగా ఆడుకోవడం వంటివి ఎన్నో చేశాం. వీటితో మనకున్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం. సాధారణంగా నదుల్లో నీరు ప్రవహిస్తుంటుంది. కానీ అదే నదిలో లావా ప్రవహిస్తే....

Video Viral: ఈ నదిలో ప్రవహించేది నీరు కాదు.. వేగంగా పరుగులు తీస్తూ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Lava River
Follow us on

నదులు (River) అంటే మనందరికీ తెలిసిందే. వాటిలో దిగి ఈతకొట్టడం, సరదాగా ఆడుకోవడం వంటివి ఎన్నో చేశాం. వీటితో మనకున్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం. సాధారణంగా నదుల్లో నీరు ప్రవహిస్తుంటుంది. కానీ అదే నదిలో లావా ప్రవహిస్తే.. వామ్మో.. వింటుంటేనే భయంకరంగా అనిపిస్తోంది కదూ.. మీరు విన్నది నిజమే. ఓ అగ్నిపర్వతై బద్దలై లావా బయటకు వచ్చినప్పుడు ఆ ప్రవాహం అచ్చం నదిని తలపించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారింది. నదిలోని నీరు ఎంత బలమైన ప్రవాహంలో ప్రవహిస్తుందో, అదే విధంగా ఇక్కడ అగ్నిపర్వతంలోని లావా చాలా వేగంగా ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. హవాయిలోని బిగ్ ఐలాండ్‌లోని కిలౌయా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు విడుదలైన లావాగా అధికారులు గుర్తించారు. ఇది ప్రపంచంలోని క్రియాశీలక అగ్నిపర్వతాలలో ఒకటి. ఈ అగ్నిపర్వతంలో తరచుగా విస్ఫోటనాలు జరుగుతుంటాయి. దీని కారణంగా భూకంపాలూ సంభవిస్తాయి.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. వండర్ ఆఫ్ సైన్స్ అనే ఐడితో ఉన్న ఈ వీడియో నిడివి18 సెకన్లు. ఇప్పటివరకు ఈ వీడియోను 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 29 వేలకు పైగా లైక్ చేశారు. దీనిని చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘ఇది నిజమని నాకు తెలుసు, కానీ దానిని చూడగానే ప్రవహించే లావా వీడియో గేమ్‌లా కనిపిస్తోంది’ అని, మరొకరు ఇది భయానకంగా అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..