Last Ambassador Car: మనదేశంలో అంబాసిడార్ కారు ఎంతో ఫేమస్. 1990ల్లో హిందుస్థాన్ మోటార్స్ సంస్థ తయారు చేసిన ఈ కారు మోటార్ ఫీల్డ్‌లో తన సత్తా చాటింది. దేశ ప్రజలందరి మన్ననలను పొందింది. ధనవంతుల వాహనంగా, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనంగా స్పెషల్ హోదా మెయింటెన్ చేసింది. భారత్‌లో సుదీర్ఘ కాలం పాటు తయారైన కారు మోడల్‌గా అంబాసిడర్ చరిత్ర సృష్టించింది. అలాంటి రాయల్ ప్రస్టేజ్ పొందిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని 2014 నుంచి నిలిపివేసింది హిందుస్థాన్ మోటార్స్. కాగా, తమ ఆఖరి అంబాసిడర్ కారుకు మధ్య రైల్వేకు చెందిన ముంబై విభాగం ఘనంగా తుది వీడ్కోలు పలికింది.
మధ్య రైల్వేలో 35 సంవత్సరాలుగా సేవలందిస్తూ, ఇంతకాలం మిగిలి ఉన్న ఏకైక వాహనం ఈ అంబాసిడర్.. ఇక దీని సర్వీస్ పూర్తిగా ముగిసిపోయిందని భావించిన అధికారులు వాహనాన్ని స్క్రాప్ చేయాలని నిర్ణయించారు. ఆ కారును పూలదండలతో అలంకరించి, మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికారు. కారుతోపాటు ఆ కారును 35 ఏళ్లుగా నడిపిస్తున్న డ్రైవర్ కూడా ఉద్యోగం నుండి రిటైర్‌మెంట్ పొందారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు రైల్వే అధికారులు, సిబ్బంది.
సెంట్రల్ రైల్వే సేవలలో మిగిలి ఉన్న ఒకే ఒక్క ఈ అంబాసిడర్ కారు 1985, జనవరి 22న రైల్వే సేవల్లోకి ప్రవేశించింది. అప్పట్నుంచి ఈ కారుకు డ్రైవర్‌గా ముత్తు పాండీ నాడార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా కొనసాగుతున్నారు. కారుతో పాటే ఆయన కూడా ఒకేసారి పదవి విరమణ పొందారు. 35 సంవత్సరాలుగా మధ్య రైల్వేలో సేవలందిస్తూ, ఇంతకాలం మిగిలి ఉన్న ఏకైక అంబాసిడర్ వాహనాన్ని స్క్రాప్ చేయాలని అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో ఆ కారును పూలదండలతో అలంకరించి, మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికారు. కరీరోడ్ డిపోలో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు.
Also read:
Funny Video: కంత్రీ పిల్లి.. యాక్టింగ్‌లో ‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..!
Health News: ఆకలి వేయడం లేదా? అసలు కారణం ఇదేనంటూ షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు..