ఘనంగా గణేష్‌ ఉత్సవాలు.. అప్పుడే 80 మందితో మొదలైన హుండీ లెక్కింపు.. ఎక్కడంటే..

కోరిన కోరికలు తీరుస్తున్న ఈ గణేశుని దర్శనానికి దేశ నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు ఇక్కడకు తరలి వస్తుంటారు. వివిధ రంగాల సెలబ్రిటీలు సైతం ఇక్కడికి వచ్చి గణపతి దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనానికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ వీఐపీ పాసులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే మొదటి రోజున హుండీ లెక్కింపు నిర్వహించారు..

ఘనంగా గణేష్‌ ఉత్సవాలు.. అప్పుడే 80 మందితో మొదలైన హుండీ లెక్కింపు.. ఎక్కడంటే..
Lalbaugcha Raja

Updated on: Aug 28, 2025 | 4:51 PM

ఊరువాడా గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అటు, ముంబైలో వినాయకుడి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సర్వజనిక్ ఉత్సవ్ మండలంలో ఏర్పాటు చేసిన లాల్‌బాగ్చా రాజా మొదటి రోజు విరాళాలను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోశాధికారి మంగేశ్ దత్తారామ్ దల్లి మాట్లాడుతూ.. హుండీ లెక్కింపు ప్రారంభమైందని చెప్పారు.. మొత్తం మూడు పెట్టెలు ఉన్నాయి. ఒక పెట్టె మాత్రమే తెరిచి 80 మంది సిబ్బంది లెక్కింపు మొదలుపెట్టారు. గతేడాది మొదటిరోజు రూ.48లక్షలు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఈ దిగ్గజ మండపం, ప్రారంభ రోజున ప్రసాదాల కోసం మూడు విరాళ పెట్టెలను ఏర్పాటు చేసింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

లాల్ బాగ్చా గణేశుడు ప్రముఖ గణేష్ మంటపల్లో ఒకటి. ముంబైలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 1934 నుంచి లాల్ బాగ్చా మార్కెట్లో కొలువుదీరిన ఈ గణేశుడి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏదాది ఇక్కడికి లక్షలాదిమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కోరికలు తీరుస్తున్న లాల్ బాగ్చా గణేశుని దర్శనానికి దేశ నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులతోపాటు ఇక్కడ ప్రముఖులు కూడా వస్తారు. వివిధ రంగాల సెలబ్రిటీలు సైతం ఇక్కడికి వచ్చి గణపతి దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనానికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ వీఐపీ పాసులు కూడా అందుబాటులో ఉంటాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..