
మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో చిరుతపులి బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలో భాగంగా చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల బృందంపై ఆ చిరుత దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి తృటిలో తప్పించుకోవడం గమనార్హం. మహావితరణ్ MSEB ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ సంఘటన జరిగింది.
చిరుతపులి తమను వెంబడించడంతో పోలీసు అధికారులు ఇరుకైన సందుల్లో పారిపోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఒక పోలీసు అధికారి నేలపై పడిపోయారు. వెంటనే, చిరుతపులి అతనిపైకి దూకి దాడికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ, ఆ అధికారి అప్రమత్తంగా ఉండగా.. మిగిలిన బృందం కేకలు వేస్తూ, వస్తువులు విసరడం వల్ల చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆ పోలీసు అధికారి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.
వుడ్‌ల్యాండ్ హోటల్, బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, మహావితరణ్ కార్యాలయం వంటి ప్రముఖ ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నివేదికలు రావడంతో నగరవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసు అధికారులు కర్రలు, రాడ్లను ఉపయోగించడం వలన చిరుత మరింత దూకుడుగా మారి, దాడికి తెగబడింది. ఈ ఆపరేషన్ సమయంలో ఒక పోలీసు అధికారితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అటవీ అధికారులు తెలిపారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని ధృవీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరో భయానక సంఘటనలో.. తమిళనాడులోని నామక్కల్-సేలం రోడ్డుపై కారు సైడ్ మిర్రర్‌లో పాము కన్పించడంతో డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చలి, వర్షాకాలంలో వాహనాలను క్షున్నంగా తనిఖీ చేయాలని ఈ సంఘటన గుర్తు చేస్తుంది.
𝕂𝕆𝕃ℍ𝔸ℙ𝕌ℝ | The leopard’s sudden appearance in Kolhapur city has sent shockwaves among residents, with multiple sightings reported in prominent locations like Woodland Hotel, BSNL office, and Mahavitaran office. The big cat’s aggressive behavior has led to attacks on… pic.twitter.com/23kDp35PoZ
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) November 11, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..