
మరణం, జీవిత సత్యం గురించి అనేక సిద్ధాంతాలు, అద్భుతాలు ప్రచారంలో ఉన్నాయి. మరణం తర్వాత తిరిగి బ్రతకడం అసాధ్యం. కానీ, ఈ ప్రపంచంలో ఒకసారి కాదు, ఆరుసార్లు మరణాన్ని ఓడించిన వ్యక్తి ఉన్నాడు. అవును, మీరు విన్నది నిజమే.. టాంజానియా నివాసి అయిన ఇస్మాయిల్ అజీజీ ఆరుసార్లు మరణించాడు. ప్రతిసారీ చివరికి అతను సజీవంగా మారాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక డాక్యుమెంటరీ ప్రకారం, అజీజీ ఆరుసార్లు మృత్యువు నుండి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. అతను వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించబడిన ప్రతిసారీ, డాక్టర్లు, ప్రజలను ఆశ్చర్యపరిచే పరిస్థితులలో అతను సజీవంగా, శ్వాస తీసుకుంటూ బ్రతికాడు.
పనిలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత అజీజీకి మొదటిసారి మరణం సంభవించింది. ప్రమాదంలో అతను చనిపోయినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ, అంత్యక్రియలకు ముందు అతను మేల్కొని బయటకు వెళ్లాడు. ఆ తరువాత తను మాట్లాడుతూ… నన్ను శవాగారానికి తీసుకెళ్లారు, కానీ నేను మేల్కొన్నప్పుడు నాకు చాలా చలిగా ఉంది. అదృష్టవశాత్తు శవాగారం మూసివేయలేదు. దాంతో నేను బయటకు వెళ్ళాను. నా కుటుంబం నన్ను చూడగానే, నేను దెయ్యం అని భావించి పారిపోయారని చెప్పాడు.
రెండవసారి అతను ఇలాగే చనిపోయి, తరువాత మళ్లీ బ్రతికాడు.
రెండవసారి ఇస్మాయిల్ కు మలేరియా వచ్చి చనిపోయినట్లు ప్రకటించారు. కానీ, దీని తర్వాత కూడా అతను మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు.. అతని కుటుంబ సభ్యులు అతన్ని శవపేటికలో పెట్టడానికి సిద్ధమైన వెంటనే, అతను మళ్ళీ బ్రతికాడు. దీని తర్వాత కూడా ఈ క్రమం ఆగలేదు. మలేరియా తర్వాత అతను పాము కాటుకు గురై మరణించాడు. దీని తర్వాత ఒకసారి అతను లోతైన గుంతలో పడి మరణించాడు. చివరిసారి అతని శరీరం మూడు రోజులు మార్చురీలో ఉంది.
అజీజీ ఎవరికీ హాని చేయనప్పటికీ, స్థానికులు అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. అతను తిరిగి రావడాన్ని మాయాజాలం లేదా అతీంద్రియ శక్తులతో ముడిపెట్టారు. కొందరు అతను మంత్రవిద్యను అభ్యసిస్తున్నాడని కూడా ఆరోపించారు. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న అజీజీ చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటూ, వంట చేసుకుంటూ , చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
ఆఫ్రిమాక్స్ ప్రకారం, వారు శాపగ్రస్తులుగా లేదా అమరులుగా పరిగణించబడతారు. వారి సంఘం లేదా కుటుంబం నుండి ఇకపై ఎటువంటి మద్దతు పొందరు. ఇవన్నీ ఉన్నప్పటికీ, అజీజీ ప్రశాంతంగా ఉన్నాడు. కానీ, ఎలాంటి మనస్తాపానికి గురికాలేదు. అతని కథ ఒక అద్భుతంలా అనిపించవచ్చు. కానీ, ఇప్పుడు అతను ఒంటరివాడు. అందరూ ఉన్నా కూడా తనను ఎవరూ సమీపంచరని చెబుతున్నాడు. అతను ఇలా అంటున్నాడు.. నేను మరణం నుండి తిరిగి వచ్చిన ప్రతిసారీ, నా శరీరంలో ఒక వింత అనుభూతి కలిగింది. ప్రజలు నన్ను మంత్రగాడిలా చూడటం ప్రారంభించారని వాపోయాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..