King Cobra: కింగ్ కోబ్రాతో ఆటలు వద్దు బాసూ.. తోక పట్టుకున్నాడని విశ్వరూపం చూపించింది.. వీడియో..

|

Jan 11, 2023 | 9:54 PM

భూ మండలం పై ఎన్నో రకాల పాములు ఉన్నాయి. అందులో చాలా వరకు విషం లేనివే ఉంటాయి. కొన్ని మాత్రమే విషపూరితమైనవి. ఇవి ఒక్కసారి కాటు వేస్తే.. దెబ్బకు గిలగిల కొట్టుకోవాల్సిందే. ఒక్కో సారి ప్రాణాలు కూడా పోతాయి....

King Cobra: కింగ్ కోబ్రాతో ఆటలు వద్దు బాసూ.. తోక పట్టుకున్నాడని విశ్వరూపం చూపించింది.. వీడియో..
King Cobra
Follow us on

భూ మండలం పై ఎన్నో రకాల పాములు ఉన్నాయి. అందులో చాలా వరకు విషం లేనివే ఉంటాయి. కొన్ని మాత్రమే విషపూరితమైనవి. ఇవి ఒక్కసారి కాటు వేస్తే.. దెబ్బకు గిలగిల కొట్టుకోవాల్సిందే. ఒక్కో సారి ప్రాణాలు కూడా పోతాయి. పాములన్నింటిలో కింగ్ కోబ్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిని పాముల రాజు అని కూడా పిలుస్తుంటారు. ఈ పాము ఒకేసారి 20 మందిని చంపేసేంత విషాన్ని చిమ్ముతుంది. కొందరు మాత్రం ఎలాంటి భయం లేకుండా పాములను పట్టుకుంటారు. వాటితో ఆటలు ఆడుకుంటుంటారు. కొన్ని సార్లు వారు కూడా ఆ పాముల బారిన పడుతుంటారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే.. గుండె ధైర్యం కలిగిన వారు మాత్రమే ఈ వీడియో చూడాలని కోరుతున్నాం.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లో కింగ్ కోబ్రా ప్రవేశిస్తుంది. ఆ ఇంటి వారు వెంటనే అలర్ట్ అయ్యి.. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇస్తారు. దీంతో ఓ వ్యక్తి ఆ ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో ఇంట్లోకి వేగంగా పరిగెడుతున్న పామును గమనిస్తాడి. తోకను పట్టుకుంటాడు. అంతే.. మరుక్షణం జరిగిన దానికి భయంతో వణికిపోతాడు. పాము తోక పట్టుకోగానే.. కింగ్ కోబ్రా ఒక్కసారిగా అతనిపైకి రావడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసేందుకు చాలా భయంకరంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘నా తోకను తాకడానికి ఎప్పుడూ ధైర్యం చేయకు’ అని వీడియోకు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో తెగ చక్కర్లు కొడుతోంది. లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి