పాములంటే భయపడని వారు ఉండరు. అక్కడెక్కడో దూరంగా పాము ఉందని తెలిస్తే చాలు.. అటు వైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో భారీ సర్పాలు జనావాసాల్లోకి చొరబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే, జరిగిన ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఈ వీడియో జనాలను మాత్రం తెగ భయపెడుతోంది! వీడియో ఆధారంగా ఇక్కడ ఒక నాగుపాము ఇనుప పైపులో దాక్కుంది. అయితే, కొందరు వ్యక్తులను పైపులను ఎత్తుతున్న క్రమంలో వాటిలోపల దూరిన పాము ఒక్కసారిగా బయటకు వచ్చి పడగ విప్పింది. కోపంతో బుసలు కొడుతూ ప్రజలపై దాడికి యత్నించింది.
ఈ వీడియో మే 13న @WildLense_India హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీడియోకి ఇచ్చిన క్యాప్షన్‌లో జాగ్రత్త!!! అంటూ రాసుకోచ్చారు. ఈ 19 సెకన్ల వీడియోలో నాగుపాము పైపులో దాగి ఉందని స్పష్టంగా కనిపించింది. అయితే, అక్కడి ప్రజలు పామును బయటకు తరిమేందుకు ప్రయత్నించినప్పుడు అది కోపంతో బుసలు కొడుతుంది. మనిషి దొరికితే, పీక్కుతినేస్తుందా..? అన్నంత భయంకరంగా శబ్ధాలు చేస్తూ బుసలు కొడుతుంది. అది శబ్ధం కూడా వీడియోలో వినిపిస్తుంది. ఈ భయానక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
Beware!!!! pic.twitter.com/y4FYgzEQLW
— WildLense® Eco Foundation ?? (@WildLense_India) May 13, 2023
వైరల్ వీడియోకి టన్నుల కొద్దీ వ్యూస్, లైక్‌లు వచ్చాయి. అలాగే, కొంతమంది వినియోగదారులు భయపడుతూ.. వీడియో చూస్తుంటే.. తనకు గూస్‌బంప్స్ వచ్చాయంటూ కామెంట్ చేయగా, మరికొందరు అయ్యా బాబోయ్ ఎంత భయంకరమైన పాము ఇది అని రాశారు. అయితే, మరికొందరు మాత్రం పాత వస్తువులు, ఇలాంటి పైపులను తిరిగి ఉపయోగించే ముందు జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే, పాములు, తేళ్లు వంటివి చీదుగా ఉండే ప్రాంతాల్లోనే నివాసం ఏర్పాటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఈ వీడియో చూసి మీరు కూడా భయపడుతున్నారా? అవును అయితే, కామెంట్‌లో చెప్పండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఈ లింక్‌పై క్లిక్ చేయండి..