కరోనాతో విధించిన లాక్‌డౌన్ కారణంగా పలు కార్యాలయాలు మూత పడ్డాయి. ఇప్పటికీ కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క ఫ్రం హోమ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీంతో చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. మరోవైపు కరోనా కేసులు తగ్గకపోవడంలో విద్యాసంస్థలు కూడా ఆన్‌లైన్ తరగతులకే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను పట్టుకుని పిల్లలు కూడా ఇంట్లోనే చదువుకుంటున్నారు. దీంతో ఇటు పిల్లల బాధ్యతలు, అటు ఆఫీస్ పనులను సమన్వయం చేసుకోలేక కొంతమంది తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. . ముఖ్యంగా ఇంట్లో నుంచి లైవ్ మీటింగులు, డిబేట్‌లు చేస్తున్న సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీవీ షోలకు వారే నిజమైన అతిథులు…
వీడియోలో భాగంగా ఓ వ్యక్తి టీవీ ఛానల్‌కు లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుండగా తన కుమారుడు పదే పదే అంతరాయం కలిగించాడు. ముందుగా తండ్రి వెనక నిలబడి కెమెరా వైపు చూస్తూ హాయ్ చెబుతూ కనిపించాడు. ఇది గమనించిన ఆ వ్యక్తి కుమారుడిని పక్కకు వెళ్లమని చెప్పగా…అతడు వెళ్లిపోయాడు. అయితే కొద్ది సేపటి తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన పిల్లాడు తండ్రి వెనకాలే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. పిల్లాడి చిలిపి చేష్టలు చూసిన టీవీ షో యాంకర్ కూడా చిరునవ్వులు చిందించడం గమనార్హం. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘ అలాంటి పిల్లలే టీవీ షోలకు నిజమైన అతిథులు’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
A special guest on @bsurveillance was very excited about Weidmann’s departure from the Bundesbank pic.twitter.com/o2sgMk2MK0
— Aggi (@aggichristiane) October 20, 2021
Also Read: