Dolphin in Yamuna: యమునా నదిలో డాల్ఫిన్‌ను వేటాడిన మత్స్యకారులు.. ఇంటికి మోసుకెళ్లి ఏం చేశారంటే..

|

Jul 25, 2023 | 8:52 PM

Dolphin Found in Yamuna: డాల్ఫిన్‌ను వేటాడుతున్న వీడియో కూడా బయటపడింది. దీంతో అటవిశాఖ అధికారులు రంగంలోకి దిగారు.. వేటాడినవారిని అరెస్ట్ చేసి.. వారి నుంచి వివరాలను సేకరించారు. నలుగురు మత్స్యకారులపై కేసు నమోదైంది. డాల్ఫిన్ అనుకోకుండా..

Dolphin in Yamuna: యమునా నదిలో డాల్ఫిన్‌ను వేటాడిన మత్స్యకారులు.. ఇంటికి మోసుకెళ్లి ఏం చేశారంటే..
Dolphin
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో యమునా నదికి చెందిన డాల్ఫిన్ చేపలను వేటాడి తినేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డాల్ఫిన్‌ను వేటాడుతున్న వీడియో కూడా బయటపడింది. దీంతో అటవిశాఖ అధికారులు రంగంలోకి దిగారు.. వేటాడినవారిని అరెస్ట్ చేసి.. వారి నుంచి వివరాలను సేకరించారు. నలుగురు మత్స్యకారులపై కేసు నమోదైంది. డాల్ఫిన్ అనుకోకుండా యమునా నదిలో లభించిందని.. దానిని నలుగురు కలిసి ఇంటికి తీసుకెళ్లి తిన్నట్లుగా ఒప్పుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వైరల్ వీడియోను గమనించిన పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి మత్స్యకారులలో ఒకరిని అరెస్టు చేశారు.

ఈ ఘటన ఆదివారం జరిగినట్లు సమాచారం అందగా ఒకరోజు తర్వాత ఫిర్యాదు చేశారు. చైల్ ఫారెస్ట్ రేంజర్ రవీంద్ర కుమార్‌ సోమవారం కేసు నమోదు చేశారు. ఇక్కడి నసీర్‌పూర్‌ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు చేపలు పట్టే సమయంలో డాల్ఫిన్ వలలో చిక్కుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

యమునా నదిలో డాల్ఫిన్‌ల వేటకు సంబంధించి ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ అందించిన సమాచారం ప్రకారం.. నదిలో ఉన్న డాల్ఫిన్‌ను బయటకు తీసుకొచ్చి భుజంపై మోసుకెళ్లి ఓ ఇంటికి తీసుకెళ్లామని, అక్కడ వండుకుని తిన్నామని పిప్రి ఎస్‌హెచ్‌వో శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపారు. మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకెళుతుండగా కొందరు బాటసారులు చిత్రీకరించారని అటవీశాఖ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అటవీశాఖ అధికారి ఫిర్యాదు మేరకు రంజీత్ కుమార్, సంజయ్, దీవన్, బాబాలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంజీత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం