Viral: అద్భుతాలు జరుగుతాయంటే కొందరు నమ్మరు.. ఈ వ్యక్తికి అల్ట్రాసౌండ్‌ చేసిన డాక్టర్లే షాక్..

|

Aug 25, 2022 | 3:55 PM

మాములుగా అయితే ఏ వ్యక్తికైనా 2 కిడ్నీలు ఉంటాయ్. కాగా అనారోగ్య కారణాల వల్ల లేదా ఇతరులకు ఒక కిడ్నీ డోనేట్ చేయడం వల్ల.. కేవలం ఒకే ఒక్క కిడ్నీతో బ్రతికేవాళ్లు కూడా ఉంటారు. కానీ ఇప్పడు చెప్పబోయే తరహా వ్యక్తులు మాత్రం అరుదు.

Viral: అద్భుతాలు జరుగుతాయంటే కొందరు నమ్మరు.. ఈ వ్యక్తికి అల్ట్రాసౌండ్‌ చేసిన డాక్టర్లే షాక్..
Man Has 3 Kidneys
Follow us on

Trending: మాములుగా అయితే ఏ మనిషికైనా రెండు కిడ్నీలు ఉంటాయి. ఒకవేళ ఒక కిడ్నీ బాగా పాడయితే వైద్యులు దాన్ని తీసివేస్తారు. అలా ఒకే ఒక్క వ్యక్తి కిడ్నీతో బ్రతికేవాళ్లు ప్రపంచంలో బోలెడు మంది ఉన్నారు. అలా కాకుండా కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కు తమ కిడ్నీ దానం చేసి.. ఒక కిడ్నీతో జీవించేవారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే వ్యక్తికి మాత్రం ఆశ్చర్యకరంగా 3 కిడ్నీలు ఉన్నాయి. యూపీ(Uttar Pradesh)లోని కాన్పూర్(Kanpur) మహానగరంలో ఈ వింత కేసు వెలుగుచూసింది. అక్కడ స్థానికంగా వ్యాపారం చేసే సుశీల్ గుప్తా(52) అనే వ్యక్తి 2020 బ్లాడర్ సర్జరీ చేయించుకున్నారు. ఆ సమయంలో అల్ట్రాసౌండ్‌లో ఆయనకు 3 మూత్రపిండాలు ఉన్నట్లు తేలింది. అప్పుడు గుప్తా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.  కొన్ని నెలల తర్వాత, అతను మళ్లీ అల్ట్రాసౌండ్ చేయించుకోగా.. మూడు కిడ్నీలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. అతనికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఎవరైనా అవసరం ఉండి అడిగితే తన 3వ కిడ్నీని దానం చేస్తానని గుప్తా చెబుతున్నారు. అంతేకాదు తాను చనిపోయిన తర్వాత.. కళ్లు డొనేట్ చేస్తానని ప్రకటించారు. 3 కిడ్నీలు తనకు దైవం ఇచ్చిన వరం అని పేర్కొన్నాడు. ఈ విషయంపై సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఉమేష్ దూబే మాట్లాడుతూ  ఒక వ్యక్తికి  మూడు కిడ్నీలు ఉన్న సందర్భాలు చాలా అరుదు అని తెలిపారు. అతను అందరిలానే ఆరోగ్యంగా ఉంటాడని.. ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు.

Man Has 3 Kidneys

మరిన్ని జాతీయ వార్తల కోసం..