బిడ్డ అంటూ బిల్డప్..కిలాడీ మహిళ మోసానికి బ్రేక్!

బిడ్డ అంటూ బిల్డప్..కిలాడీ మహిళ మోసానికి బ్రేక్!
Baby made of dough, woman tries to get govt scheme money, exposed

అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం మనుషులు ఎంత క్రియేటీవ్‌గా ఆలోచిస్తున్నారో చెప్పడానికి తాజా ఘటన ఉదాహరణ. ఈ మాత్రం తెలివి బాగుపడటానికి ఉపయోగిస్తే ఎంత మంచిదో. కానీ జనాలు అతి తెలివి మాత్రం వీడటం లేదు.  ఓ కిలాడీ మహిళ  గోధుమ పిండి ముద్దను అప్పుడే పుట్టిన బిడ్డలా నమ్మించి వేల రూపాయలు అప్పనంగా కొట్టేయాలనుకుంది. కానీ, కాలం కలిసిరాక అడ్డంగా బుక్కైంది.  ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మొరీనా జిల్లా […]

Ram Naramaneni

|

Aug 24, 2019 | 5:33 PM

అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం మనుషులు ఎంత క్రియేటీవ్‌గా ఆలోచిస్తున్నారో చెప్పడానికి తాజా ఘటన ఉదాహరణ. ఈ మాత్రం తెలివి బాగుపడటానికి ఉపయోగిస్తే ఎంత మంచిదో. కానీ జనాలు అతి తెలివి మాత్రం వీడటం లేదు.  ఓ కిలాడీ మహిళ  గోధుమ పిండి ముద్దను అప్పుడే పుట్టిన బిడ్డలా నమ్మించి వేల రూపాయలు అప్పనంగా కొట్టేయాలనుకుంది. కానీ, కాలం కలిసిరాక అడ్డంగా బుక్కైంది.  ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మొరీనా జిల్లా కైలరాస్‌కు చెందిన  ఓ మహిళ ‘‘ఉదయ్‌ శ్రామిక్‌ సేవా సహాయత యోజన’’ క్రింద గర్భిణుల షోషకాహారం కోసం రూ. 1400, కాన్పు తర్వాత రూ. 16 వేలు ఇస్తారని తెలుసుకుంది. దీంతో భర్తతో కలిసి ఓ పథకం రచించింది. గోధుమపిండి ముద్దను అప్పుడే పుట్టిన బిడ్డలాగా తయారుచేసి దానికి ఎరుపురంగు పూసింది. ఆ ముద్దమీద ఓ చిన్న గుడ్డముక్క కప్పి.. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ పిల్లల పేర్లు నమోదు చేసుకునే నర్సు వద్దకు చేరుకున్న మహిళ  తన బిడ్డ పేరు రిజిస్టర్‌లో నమోదు చేయాలని కోరింది. బిడ్డని పరీక్ష చేసిన తర్వాతే పేరు నమోదు చేస్తానని నర్సు తెలిపింది. ఇందుకు ఆ మహిళ ఒప్పు కోలేదు. అప్పుడే పుట్టిన బిడ్డను ఇవ్వటం కుదరదని తెగేసి చెప్పింది.

అంతటితో ఆగకుండా మహిళ, ఆమె భర్త అక్కడి సిబ్బందితో గొడవకు దిగి నానా హంగామా చేశారు. వారు ఎంత సర్ది చెప్పిన వినకపోగా.. తన బిడ్డ చినపోయిందని.. టైంకి  వైద్యం అంది ఉంటే బ్రతికేది అంటూ అక్కడి స్టాప్‌ను బ్లెయిమ్ చేస్తూ.. సదరు మహిళ గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఈ సమయంలోనే..బిడ్డను చూచాయగా చూసిన డాక్టర్లు ఇదంతా కట్టుకథ అని తెలుసుకున్నారు. ఆ తర్వాత గుట్టు విప్పితే  గోధుమ పిండితో తయారు చేసిన బొమ్మగా గుర్తించి షాక్‌ తిన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu