Viral: రెస్టారెంట్లో పరుగులు పెడుతున్న రోబోలు.. ఆర్డర్ ఇస్తే నిమిషాల్లోనే సర్వ్.. వీడియో చూడండి..

|

Aug 10, 2022 | 7:56 AM

Jodhpur Robot Restaurant: ఈ హోటల్లో వెయిటర్స్ ఉండరు..ఎస్‌ హోటల్లో అందరూ చిట్టీలే..ఆర్డర్ ఇస్తే నిమిషాల్లోనే మీ టెబుల్ మీద పెట్టేస్తాయ్‌..సరికొత్త ఫీల్ కలిగించే ఈ రెస్టారెంట్‌ ఎక్కడంటే..?

Viral: రెస్టారెంట్లో పరుగులు పెడుతున్న రోబోలు.. ఆర్డర్ ఇస్తే నిమిషాల్లోనే సర్వ్.. వీడియో చూడండి..
Robot Restaurant
Follow us on

Jodhpur Robot Restaurant: సాంకేతిక హంగులతో రోబోటిక్‌ రెస్టారెంట్లు దూసుకువస్తున్నాయి. కరోనా మహమ్మారి నేర్పిన భౌతిక దూరం పాఠంతో రెస్టారెంట్లలో రోబోలు సేవలు అందిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాల్లో అందుబాటులో ఉన్న రోబోటిక్ రెస్టారెంట్స్ ఇప్పుడు రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో కొత్తగా ప్రారంభమైంది. ఒక్కసారి ఈ రెస్టారెంట్‌లో అడుగుపెట్టామంటే మనకు రజనీకాంత్‌ రోబో సినిమాలోని చిట్టి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ రెస్టారెంట్‌ యాజమాన్యం ట్రెండ్‌ను సెట్‌ చేసింది.. కాబట్టి కస్టమర్లను ఆకర్షించేందుకు, ఆహ్వానించేందుకు మనుషులకు బదులు చిట్టి ది రోబో 3.Oని నియమించింది. అవును ఆ రెస్టారెంట్‌లో మనుషులు ఉండరు.. అన్నీ రోబోలే ఉంటాయి. రోబోలు ట్రాక్‌పై కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి కస్టమర్లను పలకరించడం, వారి దగ్గర ఆర్డర్‌ తీసుకోవడం నిర్దిష్టమైన సమయానికి తిరిగి సర్వింగ్‌ చేయడం ఈ రెస్టారెంట్‌ ప్రత్యేకత.

డిజైన్‌ చేసిన ప్రోగ్రామింగ్‌ ఆధారంగా అచ్చం మనిషిలా పనిచేసే రోబోలు ఇక్కడ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి .. ఫుడ్‌ ఆర్డర్‌ తీసుకోవడం, సర్వింగ్‌ చేయడం ద్వారా రోబోలు రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. కస్టమర్లను సరదాగా పలకరించడం, జోక్‌లతో ఆకట్టుకోవడం రెస్టారెంట్‌లోని రోబోల ప్రత్యేకత.. రెస్టారెంట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడి వాతావరణం అంతా మనల్ని ఆకట్టుకుంటుంది. కూల్‌గా సాగే మ్యూజిక్‌, అక్కడి లైట్లు, ఇంటీరియర్‌ డెకరేషన్‌, డైనింగ్‌ టేబుల్‌..ఇలా అన్ని హైక్లాస్‌గా ఉంటాయి.ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేయాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్‌ ఫుడ్ జోన్ అంటున్నారు భోజన ప్రియులు.

వీడియో కోసం ఈ లింకును క్లిక్ చేయండి.. 

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి