
Jalandhar Viral Video: వీడియో షేరింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ పాపురల్ అయ్యేందుకు రకరకాల ఫీట్స్ చేస్తున్నారు. మొదట టిక్‌టాక్ దెబ్బకు యువత మొత్తం ఆ వీడియో షేరింగ్ యాప్‌పై పడ్డారు. ఈ వీడియో షేరింగ్ యాప్ పుణ్యమా అని ఎంతో మంది తమ అందం, అభినయం, నటనాచాతుర్యంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయ్యారు కూడా. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా గుర్తింపు పొందారు. అయితే, కొన్ని కొన్ని సార్లు వారు చేసే రీల్స్, వీడియోస్ వారికి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఇందుకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ ఇన్‌స్టాగ్రమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ కోసం పోలీస్ వాహనం బాన్‌ట్‌పైకి ఎక్కి.. రచ్చ చేసింది. పంజాబీ పాటకు యాక్టింగ్ చేస్తూ.. ఫోజులిచ్చింది. అదే సమయంలో మిడిల్ ఫింగర్ చూపిస్తూ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో అటు ఇటూ తిరిగి పోలీసు ఉన్నతాధికారుల కంట పడింది. ఇకేముంది.. అటు నెటిజన్లతో పాటు.. ఇటు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఈ వీడియోపై కన్నెర్ర జేశారు. పోలీసు వాహనంపై కూర్చుని రీల్స్ చేస్తావా? అంటూ నెటిజన్లు తిట్టిపోస్తుంటే.. పోలీస్ వాహనంపై కూర్చుని రీల్స్ చేసేందుకు అనుమతి ఇచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై గుర్రుగా ఉన్నారు ఉన్నాతాధికారులు.
వాస్తవానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పోలీస్ వాహనం ఎక్కి రీల్స్ చేసుకోవడానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనుమతి ఇచ్చారట. ఆయన అధికారిక వాహనాన్ని రోడ్డుపై నిలిపి.. తాను పక్కకు వెళ్లారు. ఆ అమ్మాయి రీల్స్ చేయడం అయిపోయాక.. వచ్చి ఆమెకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు సదరు పోలీసు అధికారి. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. అధికారిక వాహనాన్ని ఒక యువతికి అప్పగించడం, ఆమె ఆ కారు బానెట్‌పై కూర్చొని రీల్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ ఘటనపై జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్ సీరియస్‌గా స్పందించారు. సోషల్ మీడియా రీల్స్ చేయడానికి అమ్మాయికి అధికారిక వాహనాన్ని అప్పగించిన ఎస్‌హెచ్‌ఓ అశోక్ శర్మను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో కూడా పంజాబ్‌లో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇదే విధంగా ప్రవర్తించింది. థార్ బానెట్‌పై కూర్చుని జాతీయ రహదారిపై పర్యటించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవగా.. పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేయడంతో పాటు.. థార్ కారును సీజ్ చేశారు పోలీసులు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
This viral video is from #Jalandhar in which a girl is standing next to the police vehicle and making a reel for social media. pic.twitter.com/qknD2YxFc9
— Nikhil Choudhary (@NikhilCh_) September 28, 2023
BIG BRK : Jalandhar Police Commissioner Kuldeep Chahal IPS has suspended INSP/SHO Ashok Sharma. This action was taken because SHO let the Instagram Star for using the Govt Police Jeep for her Reel/Video. @CPJalandhar @Adityak_IPS @DGPPunjabPolice pic.twitter.com/JHu1mu7VK0
— Mridul Sharma (@SharmaMridul_) September 28, 2023
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..