Viral Video: సరదాగా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న జనం.. దూసుకొచ్చిన రాకాసి అలలు.. చివరకు ఏం జరిగిందంటే?

ఈ వీడియో షేర్ చేస్తూ శిఖా గోయెల్ "పశ్చాత్తాపం కంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. జోరుగా కురుస్తు్న్న వర్షాలతో ప్రభుత్వ హెచ్చరికలతో ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండండి” అంటూ క్యాప్షన్ అందించింది.

Viral Video: సరదాగా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న జనం.. దూసుకొచ్చిన రాకాసి అలలు.. చివరకు ఏం జరిగిందంటే?

Updated on: Jul 13, 2022 | 9:00 AM

తెలుగురాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచేస్తున్నాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే. పలుచోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్న సంఘటనలు మనం చూస్తేనే ఉన్నాం. అయితే, అధికారులు హెచ్చరిస్తున్నా.. కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా నదులు, సముద్రాల వద్ద ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా, ఓ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

వర్షాకాలంలో ఇలాంటి ప్రదేశాల్లో ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఎంత ప్రమాదమో ఈ వీడియోనే చెబుతోంది. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కొందరు సముద్ర తీరంలో అలలను ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఓ పెద్ద కెరటం వచ్చి అక్కడి ప్రజలను సముద్రంలోకి తీసుకెళ్లింది. దీంతో వారిని ఎవరూ రక్షించలేకపోయారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో షేర్ చేస్తూ శిఖా గోయెల్ “పశ్చాత్తాపం కంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. జోరుగా కురుస్తు్న్న వర్షాలతో ప్రభుత్వ హెచ్చరికలతో ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండండి” అంటూ క్యాప్షన్ అందించింది.

కాగా, ఒమాన్‌‌లోని సలాలహ్‌ హల్‌ ముగుసెల్‌ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందులో మొత్తం 8 మంది భారతీయులు కొట్టుకుపోయారు. ఇందులో ముగ్గురిని ప్రజలు రక్షించారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా రక్షణ రేఖను దాటడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.