Inspiring Video: కృషి పట్టుదల ఉంటె ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. అవును, మీకు ఏదైనా సాధించాలనే సంకల్పం, ధైర్యం ఉంటే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. లోకంలో చాలా మంది తమ బలహీనతలను తమ బలంగా చేసుకొని ఔరా అనిపించేలా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఓ రేసు పోటీకి (Runnig race) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత, మీరు కూడా ప్రశంసించకుండా ఉండలేరు. నిజానికి, ఈ వీడియోలో.. ఒక చిన్నారి బాలిక పరుగుల పోటీలో పాల్గొంది. అందులో తన ప్రత్యర్థుల మధ్య క్రచెస్ సహాయంతో రేసులో (little Girl Video) పరుగెత్తుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ షేర్ చేశారు. ‘ఓడిపోయినా నువ్వు ప్రతి ఒక్కరినీ గెలిచావు, బిడ్డా అంటూ కామెంట్ చేశారు. కేవలం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆ చిన్నారి ఆత్మస్తైర్యానికి వందనం చేస్తారు, ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారో తెలియదు. కానీ ఈ వీడియో ఇంటర్నెట్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో పరుగుల పోటీ సందర్భంగా చిత్రీకరించబడింది. రేస్ టు రేస్ ట్రాక్‌లో బాలికలు పాల్గొన్నారు. అందులో ఒక బాలిక ఒక కాలుతో ఊతకర్ర సాయంతో నిలబడి ఉంది. పరుగెత్తడానికి విజిల్ వేయగానే, పిల్లలు పరిగెత్తారు. మిగిలిన అమ్మాయిలు తమ గమ్యస్థానానికి పరుగులు తీస్తుండగా.. ఊతకర్రల సాయంతో పరుగెత్తే బాలిక మాత్రం పట్టు వదలకుండా ఫినిషింగ్ లైన్‌ను తాకే వరకు పరుగెత్తుతూ ఉండడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను జార్ఖండ్‌లోని రాంచీ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్ @dc_sanjay_jas నుండి షేర్ చేశారు. నాకు పదాలు దొరకడం లేదు.. ఓడిపోయి కూడా నువ్వు అందరి హృదయాలను గెలుచుకున్నావు బిడ్డా అన్ని చెప్పారు.
इस video के Caption के लिये मुझे शब्द नहीं मिल रहे.?
…..
वैसे हार कर भी तुमने सबको जीत लिया बेटी.!
? pic.twitter.com/wVI3Nlpfjd— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) April 27, 2022
Also Read: Travel special: ప్రకృతి అందాల నడుమ సూర్యోదయాన్ని వీక్షించాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక