Viral Video: సింహాలను ఓ ఆటాడుకున్న గ్రామ సింహం.. ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమనడానికి ఇదే నిదర్శనం..

Viral Video: జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, వాటిని చూసి ఢీలా పడితే అడుగు ముందుకు వేయలేం. అయితే ధైర్యంతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. సమస్య మనం ఎదుర్కోలేనంత పెద్దదైనా సరే...

Viral Video: సింహాలను ఓ ఆటాడుకున్న గ్రామ సింహం.. ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమనడానికి ఇదే నిదర్శనం..
Viral Video

Updated on: Apr 22, 2022 | 4:45 PM

Viral Video: జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, వాటిని చూసి ఢీలా పడితే అడుగు ముందుకు వేయలేం. అయితే ధైర్యంతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. సమస్య మనం ఎదుర్కోలేనంత పెద్దదైనా సరే మొండి ధైర్యంతో నిలబడితే ఆ సమస్యే పరార్‌ అవుతుంది. ఇలా జీవితానికి అవసరమైన ఈ సారాన్ని ఓ మూగ జీవి చాటి చెప్పింది. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

కాలుకి గాయమైన ఓ శునకం కుంటుతూ అటుగా వెళ్తోంది. అదే సమయంలో అక్కడే ఓ సింహం జంట సేదతీరుతోంది. కుక్కను చూడగానే రెండు సింహాలు ఒక్కసారిగా దాడి చేయడానికి ముందుకొచ్చాయి. అయితే ఆ శునకం భయపడి వెనుకడుగు వేయలేదు. ఎదుట ఉన్న జీవి తనకంటే బలమైందని, శక్తివంతమైందని, తాను గెలవడానికి ఒక్క శాతం కూడా అవకాశం లేదని తెలిసినా పారిపోలేదు. ధైర్యంగా ఆ రెండు సింహాలపై దాడికి దిగింది. విశేషమేంటంటే.. శనకం ఎదురు దాడి దిగడంతో సింహాలే వెనుకగుడు వేశాయి.

సుశాంత నంద అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేశారు. ‘గాయపడిన శునకం రెండు సింహాలను ఎదురించింది. మీకుండే ధైర్యం అసాధ్యమనుకున్న దానిని కూడా సుసాధ్యం చేస్తుంది’ రాసుకొచ్చిన క్యాప్షన్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లను తెగ వైరల్‌ చేస్తున్నారు. కుక్క ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Swapping Policy: ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర సర్కార్‌ శుభవార్త.. ఏంటంటే..!

Viral Video: భారతీయులకు ఆనంద్‌ మహీంద్రా ఛాలెంజ్‌.. అసలు మేటర్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

పోపులో వాడే జీలకర్రతో ఎన్ని ప్రయోజనాలో