
సోషల్ మీడియాలో ఒక వింత ఘటన వైరల్ అవుతోంది. ఇది రైల్వే టాయిలెట్‌కు సంబంధించిన వీడియో. ఇందులో ప్రయాణిస్తున్న రైలులో ఒక టాయిలెట్ తలుపు దాదాపు 6 గంటలుగా మూసి ఉంది. వాష్ రూమ్ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులంతా ఆ బాత్‌రూమ్ డోర్ ఓపెన్ కాకపోవటంతో తిరిగి వెళ్లిపోతున్నారు.కానీ, ఆ డోర్ చాలా సేపటి నుండి తెరుచుకోలేని కొందరు గమనించారు. లోపల ఎవరైనా ఉన్నారా..? ఉంటే వారికి ఏమైంది..? ఎందుకు గంటల కొద్దీ డోర్ ఓపెన్ చేయటం లేదు..ఇలా చాలా మంది చాలా సందేహాలు వ్యక్తం చేశారు. చివరకు ఏం జరిగిందోనని రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
నివేదిక ప్రకారం, ఈ సంఘటన ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది. టాయిలెట్ తలుపు చాలా సేపు మూసి ఉండటాన్ని ప్రయాణికులు గమనించారు. లోపలి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు, సిబ్బందిలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగవచ్చనే అనుమానాలు తలెత్తాయి. చివరికి, రైల్వే సిబ్బంది తలుపు పగలగొట్టాలని నిర్ణయించుకున్నారు. వెంటనే టెక్నికల్ టీమ్‌తో ఆ డోర్ ఓపెన్ చేశారు. కానీ లోపల కనిపించిన దృశ్యం చూసి అందరూ నోరెళ్ల బెట్టారు.
X లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఫుటుగా తాగిన మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఆ టాయిలెట్‌లోంచి తూలుతూ బయటకు వచ్చాడు. రైలు సిబ్బంది, ప్రయాణీకులు అతన్ని చూసి షాక్ అయ్యారు. కొంతమంది అతని ప్రవర్తనకు నవ్వుకుంటున్నారు. మరికొందరు కోపంతో మండిపడ్డారు.
ఈ మొత్తం సంఘటనను ఒక ప్రయాణీకుడు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వేగంగా వైరల్ అయింది. వినియోగదారులు వ్యాఖ్యలలో విభిన్నమైన కామెంట్స్ చేశారు. భావు సాహెబ్ టాయిలెట్‌ను కూడా బార్‌గా మార్చినట్టున్నాడు అంటున్నారు. మరికొందరు సరదాగా, ఆరు గంటల కృషి ఫలించింది అని రాశారు.
ट्रेन में दरवाजा बंद करके लोग क्या क्या करते है..
6 घंटा से दरवाजा बंद था।
खोद पहाड़ निकली चुहिया।
pic.twitter.com/zBK1aYC9sI— Viper (@Fredom_At_Midnt) September 27, 2025
ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో షేర్ చేస్తున్నారు. మరొకరు ఒక వినియోగదారు ఫన్నిగా ఆ వ్యక్తికి రైల్లో సీటు లేకపోవడంతో బాత్రూంలో కూర్చుని ఉండాలి. అది అతని తప్పు కాదు అంటూ రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..