Rakesh Jhunjhunwala Video: రాకేష్ జున్‌జున్‌వాలాలో మరో కోణం.. కజ్రా రే సాంగ్‌లో ఇండియన్ బిగ్ బుల్ డ్యాన్స్ ..

|

Aug 14, 2022 | 3:19 PM

Rakesh Jhunjhunwala Viral Video: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇవాళ ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. 62 ఏళ్ల వయసులో ఈ లోకానికి వీడ్కోలు పలికారు. ఇప్పుడు అతడికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rakesh Jhunjhunwala Video: రాకేష్ జున్‌జున్‌వాలాలో మరో కోణం.. కజ్రా రే సాంగ్‌లో ఇండియన్ బిగ్ బుల్ డ్యాన్స్ ..
Rakesh Jhunjhunwala Dancing
Follow us on

స్టాక్ మార్కెట్ కింగ్, ఇండియన్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా – భారతదేశం యొక్క సరికొత్త ప్రైవేట్ ఎయిర్‌లైన్ అకాసా ఎయిర్ వ్యవస్థాపకుడు – దీర్ఘకాల అనారోగ్యంతో ఆదివారం ఉదయం ముంబైలో మరణించారు. ‘ఇండియాస్ వారెన్ బఫెట్’గా పిలువబడే ఝున్‌జున్‌వాలా తన అజేయమైన ఉత్సాహం, లొంగని స్ఫూర్తికి కూడా పేరుగాంచాడు. రాకేష్ జున్‌జున్‌వాలా ఆదివారం ఉదయం ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్‌లో మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. అతను ఒక రోజు ముందు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ బహుళ అవయవ వైఫల్యం కారణంగా అతను ఈ ఉదయం మరణించాడు.

రాకేష్ జున్‌జున్‌వాలా మరణం తర్వాత ఆయనకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో చాలా మందికి ఆకట్టుకుంటున్న వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాకేష్ జున్‌జున్‌వాలా అంటే ప్రపంచానికి తెలిసిందల్లా పరుగులు పెట్టే షేర్లు.. కానీ ఇందులో రాకేష్ జున్‌జున్‌వాలాను విభిన్నంగా, చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు.

కజ్రా రే సాంగ్‌లో జున్‌జున్‌వాలా డ్యాన్స్ చేస్తూ..

ఇప్పుడు ఈ వైరల్ వీడియో గురించి సవివరమైన సమాచారాన్ని తెలుసుకుందాం.. వైరల్ వీడియోలో వీల్ చైర్‌పై కూర్చున్న రాకేష్ జున్‌జున్‌వాలాను చూడవచ్చు. రాకేష్ జున్‌జున్‌వాలా వీల్‌చైర్‌పైనే డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఐశ్వర్య రాయ్ ఫేమ్ కజ్రా-రే సాంగ్‌లో జున్‌జున్‌వాలా డ్యాన్స్ చేయడాన్నిఈ  వీడియోలో చూడవచ్చు.

ఈ వైరల్ వీడియో..

రాకేష్ జున్‌జున్‌వాలా సరదాగా డ్యాన్స్ చేయడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అతని వైపు ఇంతకు ముందు ఎవరూ చూడలేదు. ఈ వీడియోను కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌తో షేర్ చేశారు.ఈ వీడియోకు క్యాప్షన్‌తో ఇలా రాసుకొచ్చారు- ‘రాకేష్ జున్‌జున్‌వాలా రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. అతను డయాలసిస్‌లో ఉన్నారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. అదైర్య పడకుండా ఎలా జీవించాలో రాకేష్ జున్‌జున్‌వాలాను చూసి నేర్చుకోవచ్చిని ఇందులో పేర్కొంటాడు.

మర్ని ట్రెండింగ్ వార్త కోసం