Watch Video: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన విజయం.. చిమ్మచీకట్లో కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో దిగిన C-130J విమానం..

|

Jan 07, 2024 | 3:34 PM

వాస్తవానికి కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోని కార్గిల్‌లో విపరీతమైన చలి వాతావరణం వుంటుంది. కానీ, భారతదేశ భద్రతకు సంబంధించి ఇది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. కార్గిల్ హిమాలయాల్లో 8 వేల అడుగుల ఎత్తులో వుంది. అలాంటిది ఏకంగా సీ 130జే సూపర్ హెర్య్కులస్ విమానాన్ని రాత్రి సమయంలో అక్కడ ల్యాండ్ చేసింది. అది రాత్రి సమయం, చుట్టూ కారు చీకటి, దట్టమైన పొగమంచు, రంగురంగుల లైట్లతో నలువైపులా కొండలతో చుట్టుముట్టబడి ఉన్న కార్గిల్ యుద్ధ ప్రాంతంలో..

Watch Video: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన విజయం.. చిమ్మచీకట్లో కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో దిగిన C-130J విమానం..
Air Craft Night Landing
Follow us on

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మరో అరుదైన ఘనత సాధించింది. వును, భారత వైమానిక దళం తన చరిత్రలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో తన విమానంలో నైట్ ల్యాండింగ్ చేసింది. దీంతో శనివారం రాత్రి భారత వైమానిక దళ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఒక ల్యాండ్‌మార్క్ ఫీట్‌లో భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం మొదటిసారి రాత్రిపూట కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో విజయవంతంగా ల్యాండ్‌ అయింది. విమానం నైట్ ల్యాండింగ్ వీడియోను భారత వాయు సేన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అది రాత్రి సమయం, చుట్టూ కారు చీకటి, దట్టమైన పొగమంచు, రంగురంగుల లైట్లతో నలువైపులా కొండలతో చుట్టుముట్టబడి ఉన్న కార్గిల్ యుద్ధ ప్రాంతంలో.. ఆకాశంలో ఇంత పెద్ద గర్జన వింటే, శత్రు దేశం, పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా వణికిపోతుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసిన తర్వాత మీకు శ్వాస ఆగిపోయినంత పనవుతుంది..మొదట, IAF C-130 J విమానం కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్ చేసింది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోని కార్గిల్‌లో విపరీతమైన చలి వాతావరణం వుంటుంది. కానీ, భారతదేశ భద్రతకు సంబంధించి ఇది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. కార్గిల్ హిమాలయాల్లో 8 వేల అడుగుల ఎత్తులో వుంది. అలాంటిది ఏకంగా సీ 130జే సూపర్ హెర్య్కులస్ విమానాన్ని రాత్రి సమయంలో అక్కడ ల్యాండ్ చేసింది.

ఈ ల్యాండింగ్ సమయంలో, గరుడ్ కమాండోలచే టెర్రైన్ మాస్కింగ్ పని కూడా జరిగింది. టెర్రైన్ మాస్కింగ్ అనేది శత్రు రాడార్‌ను తప్పించుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాన్ని ఉపయోగించే సాంకేతికత. రాత్రిపూట ఈ ల్యాండింగ్ చేయడం ద్వారా, భారత వైమానిక దళం దాని స్వంత సామర్థ్యాలను అంచనా వేసింది. దాని ఉద్దేశాలను శత్రువులకు కూడా తెలియజేసింది. నిజానికి ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు చైనా కార్యకలాపాలను పసిగట్టిన భారత వైమానిక దళం రాత్రిపూట కూడా సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది. ఈ దిశగా అడుగులు వేస్తూ శనివారం రాత్రి నైట్ ల్యాండింగ్ నిర్వహించారు. అయితే నైట్ ల్యాండింగ్‌కు సంబంధించిన వివరాలను మాత్రం ఐఏఎఫ్ వెల్లడించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..