వివాహం ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రత్యేకమైన క్షణం. ఇక తాము కలలుగన్న లక్షణాలు ఉన్న అమ్మాయి కనిపిస్తే.. ఆమెను ఆకట్టకునేందుకు యువకులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇరువురి అంగీకారం ఉన్నా కూడా ఆ దేశంలో యువతిని పెళ్లాడటం అంత ఈజీ కాదు. మేము ఫిజీ దేశం గురించి మాట్లాడుతున్నాము, అక్కడ ఒక అబ్బాయి తనకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి చాలా ప్రమాదకరమైన పని చేయాల్సి ఉంటుంది. ఫిజీలో మీకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవటానికి, స్పెర్మ్ వేల్ చేపలను చీల్చిచెండాడాలి. స్పెర్మ్ వేల్ చేపల దంతాలకి సూపర్-నేచురల్ శక్తి ఉందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందువల్ల, వివాహం సమయంలో అబ్బాయి వాటిని బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆ దంపతుల బంధం శాశత్వంగా బలంగా ఉంటుందని వారి భావన. ఈ పద్దతి పాటించడం వల్ల వారి వివాహ జీవితం మెరుగుపడుతుందని కూడా నమ్ముతారు. ఫిజీలో పాటిస్తున్న ఈ సంప్రదాయాన్ని ప్రేమకు గొప్ప వ్యక్తీకరణ అని పిలుస్తారు.
ఫిజి ప్రజలు తిమింగలం చేపల దంతాలను చాలా పవిత్రంగా భావిస్తారు. అందువల్ల, పిల్లల పుట్టినప్పుడు లేదా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ దంతాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సంప్రదాయాన్ని టబువా అని పిలుస్తారు. ప్రస్తుతం స్పెర్మ్ వేల్ ఫిష్ చాలా అరుదుగా దొరుకుతుంది.సామాన్య ప్రజలకు దీన్ని పట్టుకోవడం కూడా వీలుపడదు. కాబట్టి ప్రొఫెషనల్ మత్స్యకారులు వీటిని వేటాడతారు.
ప్రతి ఒక్కరూ సముద్రంలోకి వెళ్లి తిమింగలాన్ని వేటాడి వాటి పళ్లను తీసుకురాలేరు. ఎందుకంటే ఈ పనిని వృత్తిపరమైన అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు. ఈ నేపథ్యంలో అక్కడ వివాహం చేసుకోదలిచిన అబ్బాయిలు.. ఈ భారీ చేపల దంతాల నుండి తయారైన దండ లేదా మరేదైనా వస్తువును కోనుగోలు చేసి బహుమతిగా ఇస్తారు. స్పెర్మ్ తిమింగలం చేపల దంతాలు చాలా విలువైనవిగా పరిగణించబడుతున్నాయి. వాటి దంతాల చిన్న భాగాన్ని కలిగి ఉన్న దండ కూడా లక్షల్లో పలుకుతుంది.
Also Read: పెద్ద విషపు పామును ముప్పుతిప్పలు పెట్టిన చిన్న గండు చీమ.. మెడపై గట్టిగా కొరికి.. కొరికి
బ్యాంకుల్లో పనుంటే ఇప్పుడే చేసుకోండి.. మే నెలలో 12 సెలవులు.. సమయంలో మార్పులు