Watch Video: ఓరీ దేవుడో.. ఇదెక్కడి దారుణం రా సామీ..! ఇడ్లీ-సాంబార్‌తో ఐస్ క్రీం అట.. వాళ్లను జైల్లో పెట్టాలంటున్న నెటిజన్లు..

|

Feb 06, 2024 | 11:12 AM

ఈ వీడియో జనవరి 17న ఇంటర్‌నెట్‌లో షేర్ చేయగా, చేయబడినప్పటి నుండి ఇప్పటివరకు 12.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ రాబట్టింది. ప్రజలు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సుక్రిత్ జైన్ కూడా వ్యాఖ్యానించారు. ఈ టేస్ట్ చాలా బావుంది కానీ' అని రాశాడు. ఒక వినియోగదారు స్పందిస్తూ..దీనిని ఎవరు కనిపెట్టారో గానీ, వారిని అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ ఇడ్లీకి న్యాయం కావాలి..

Watch Video: ఓరీ దేవుడో.. ఇదెక్కడి దారుణం రా సామీ..! ఇడ్లీ-సాంబార్‌తో ఐస్ క్రీం అట.. వాళ్లను జైల్లో పెట్టాలంటున్న నెటిజన్లు..
Idli Sambhar Ice Cream
Follow us on

ప్రస్తుతం ఆహారం విషయంలో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు వెనీలా, స్ట్రాబెర్రీ వంటి ఎంపిక చేసిన రుచులలో లభించే ఐస్ క్రీం ఇప్పుడు చౌ మెయిన్, గులాబ్ జామూన్, బిర్యానీ ఫ్లేవర్‌లో కూడా తయారు చేసిన వీడియోలో గతంలో వైరల్‌ కావటం చూశాం.. ఇక, ఇప్పుడు ఇడ్లీ-సాంబార్ రుచులతో కూడా ఐస్‌ క్రీం అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో ఇడ్లీ-సాంబార్‌తో ఐస్‌క్రీం తయారు చేయడం కనిపిస్తుంది. అయితే, ఈ ప్రయోగాన్ని చూసిన ప్రజలు మాత్రం మండిపడుతున్నారు.. ఇదేం ఐస్‌ క్రీం రా బాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారాలను ఇలా తారుమారు చేయడం మంచిది కాదని అంటున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఐస్ క్రీం రోల్ చేయడానికి సాంబార్, చట్నీని కూడా ఉపయోగిస్తుండటం మీరు చూడవచ్చు. ఈ వీడియోను ఫుడ్ వ్లాగర్ సుక్రిత్ జైన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఒక వ్యక్తి ఇడ్లీని చిన్న ముక్కలుగా కట్‌ చేసి తర్వాత ఇడ్లీ మీద ఎర్ర చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్, ఐస్ క్రీం పోశాడు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లని ప్లేట్ మీద ఐస్‌ క్రీం రోల్‌ తయారు చేస్తున్నాడు. ఎట్టకేలకు తయారైన ఇడ్లీ ఐస్‌క్రీమ్‌ను సర్వీంగ్‌ ప్లేట్‌లోకి తీసుకున్నాడు. దానిని సగం ఇడ్లీ, కొంత చట్నీతో అలంకరించాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో జనవరి 17న ఇంటర్‌నెట్‌లో షేర్ చేయగా, చేయబడినప్పటి నుండి ఇప్పటివరకు 12.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ రాబట్టింది. ప్రజలు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సుక్రిత్ జైన్ కూడా వ్యాఖ్యానించారు. ఈ టేస్ట్ చాలా బావుంది కానీ’ అని రాశాడు. ఒక వినియోగదారు స్పందిస్తూ..దీనిని ఎవరు కనిపెట్టారో గానీ, వారిని అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ ఇడ్లీకి న్యాయం కావాలి అంటూ మరోక వినియోగదారుడు రాశాడు.. మరో నెటిజన్‌ దీనిపై వ్యాఖ్యానిస్తూ.. ఇది చట్టవిరుద్ధం అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…