Viral Video: పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై దర్శనమిచ్చిన ఎడారి ఓడ.. వాహనదారులు చూసి ఏం చేశారంటే!

సాధారణంగా మనం ఒంటెలను ఎక్కడ చూస్తాం, ఏ ఎడారి ప్రాంతాల్లోనో, లేదా జూ పార్కులలోనూ చూస్తుంటాం. అయితే ఎక్కువగా ఎడారి ప్రాంతంలో కనిపించే ఒంటెలు తాజాగా హైదరాబాద్ రోడ్లపై రాత్రిపూట ప్రత్యక్షమయ్యాయి. ఏంటి ఎడారిలో ఉండాల్సిన ఒంటెలు రోడ్లపై ఎందుకు తిరుగుతున్నాయి అనుకుంటున్నారా..అయితే తెలుసుకుందాం పదండి.

Viral Video: పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై దర్శనమిచ్చిన ఎడారి ఓడ.. వాహనదారులు చూసి ఏం చేశారంటే!
Viral Video

Edited By: Anand T

Updated on: Jun 15, 2025 | 7:04 PM

ఎడారి ప్రాంతాలు, జంతు ప్రదర్శన శాలలో ఎక్కువగా కనిపించే ఒంటెలు తాజాగా హైదరాబాద్ నగరంలో దర్శనమిచ్చాయి. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే PVNR ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఓ కుర్రాడు ఒంటెపై సవారీ చేస్తూ కనిపించారు. అయితే అది గమనించిన కొందరు వేరే వాహనంలో వెళ్లున్న వాహదారులు అతనిని పలకరించే ప్రయత్నం చేశారు. కానీ, ఆ కుర్రాడు మాత్రం పెద్దగా స్పందించిలేదు. అలానే చాలా దూరం వరకు వెళ్లాడు. అయితే ఆ ఒంటెను వెంబడిస్తూ వెళ్లిన వాహనదారులు కొద్ది దూరం వెళ్లాక ఆ ఒంటెపై కూర్చొని సవారీ చేస్తున్న కుర్రాడిని అడ్డుకున్నారు.

రద్దీ ప్రాంతమైన ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఇలా జంతువు స్వారీలు ఎందుకు అనుకున్నారో.. లేక మూగజీవాన్ని కష్టపెడుతున్నారని భావించారో కానీ, మొత్తానికి ఆ కుర్రాడిని నిలువరించి ఆ ఒంటెను దాని మెడలో ఉన్న తాడుతో పక్కనున్న స్థంభానికి కట్టేశారు. ఇలా వాళ్లు ఆ కుర్రాడిని వెంబడించి మరీ ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందో అనే విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు. ఆ తర్వాత ఆ కుర్రాడిని హెచ్చరించి తిప్పి పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తతంగాన్నంత వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది.

అయితే, సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఒంటెలు ఈ మధ్య నగరాల్లో పార్కుల, తిరుణాల వంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌కు చెందిన కొందరు వలసదారులు వాటిని ఇక్కడికి తీసుకొచ్చి. పార్కుల వద్ద చిన్నపిల్లలను సరదాగా వాటిపై కూర్చోపెట్టి తిప్పి అందుకు తగ్గట్లుగా వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ జీవనం సాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే కొందరు జంతు ప్రేమికులు మాత్రం దీన్ని తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. మన అవసరాల కోసం మూగజీవులను కష్టపెట్టి, దాని కష్టంతో రాబడి మార్గాలను వెతుక్కుంటున్న ఇలాంటి చర్యలకు ఒక అడ్డుకట్ట వేయాల్సిందే అని వారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..