
కట్టుకున్న భర్తే తన భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.. ఇదేదో సినిమా కథ అనుకుంటున్నారా..? కానే కాదు..ఇలాంటి అరుదైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. సునీల్, కుష్బూ జంటకు మే 17న పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఖుష్బూ తన అత్తవారికింటి మారింది. తొమ్మిది రోజుల పాటు అక్కడే తన అత్తమామలతో గడిపింది. ఆ తర్వాత పెళ్లి అనంతర ఆచారంలో భాగంగా ఆమె తన పుట్టింటికి వచ్చింది. కానీ, తిరిగి తన భర్త వద్దకు వెళ్లడానికి బదులు ఖుష్బూ అదృశ్యమైంది. కానీ, ఒంటరిగా కాదు, తన ప్రియుడితో కలిసి పారిపోయినట్టుగా తెలిసింది. అది తెలిసిన సునీల్ ఎవరూ చేయని పనిచేశాడు.. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భర్త సునీల్ తన భార్య కుష్బూను ఆమె ప్రియుడు యశ్వంత్‌కి ఇచ్చి వివాహం చేశాడు. సునీల్‌తో పెళ్లికి ముందే కుష్బూ.. యశ్వంత్‌ని ప్రేమించింది. ఇద్దరూ వివాహానికి ముందే సంబంధంలో ఉన్నారు. ఈ విషయం పెళ్ళైన తర్వాత భర్తకు తెలిసింది. దాంతో అతడు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.. ప్రియుడిని కలవొద్దని భార్యను పదే పదే కోరినప్పటికీ ఆమె అంగీకరించలేదు. దాంతో భర్త సునీల్ ఆమెను గుడికి తీసుకెళ్లి తన ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ సందర్బంగా సునీల్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి మాటలు విన్న ప్రతి ఒక్కరూ నిర్గాంతపోయారు.
వీడియో ఇక్కడ చూడండి..
భార్య తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసినప్పుడు సునీల్ ఆలోచించాడు. ఖుష్బూ తన ప్రియుడితో కలిసి జీవించాలనే తన కోరికను స్పష్టంగా వ్యక్తం చేసినప్పుడు… సునీల్ కోపం, లేదా చట్టపరమైన బెదిరింపులకు దిగలేదు. బదులుగా ఆమె ఇష్టాన్ని గౌరవించాడు. ఆమె మాటను అంగీకరించాడు. ఇరు కుటుంబాల పెద్దలను కూడా ఒప్పించాడు. అందుకోసం అతడు చెప్పిన మాటలు విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. తాను తన భార్యను హనీమూన్ కోసం నైనితాల్ తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్పాడు. కానీ, ఆమె మరో చోట ఆనందాన్ని పొందితే, తాను కూడా సంతోషంగా ఉన్నాను. తాను మరో రాజా రఘువంశీ లాగా జీవితాన్ని ముగించలేదు..అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ముగ్గురం ఇప్పుడు సంతోషంగా ఉన్నామని చెప్పాడు. నా భార్య ఆమె ప్రేమికుడు ఒకరినొకరు చేరుకున్నారు అని చెప్పాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..