Viral Video: అయ్యయ్యో.. పనస పండు కోసం ఏనుగు తిప్పలు.. చూస్తే షాకవ్వకుండా ఉండరు..

|

Aug 03, 2022 | 10:15 AM

అందులో ఓ ఏనుగు చెట్టు కొమ్మకు వేలాడుతున్న పనసపండును తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పనస చెట్టును కాసేపు కదిలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Viral Video: అయ్యయ్యో.. పనస పండు కోసం ఏనుగు తిప్పలు.. చూస్తే షాకవ్వకుండా ఉండరు..
Viral Video
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో వన్యప్రాణాలకు సంబంధించిన అనేక వీడియోస్ వైరల్ అవుతుంటాయి. చిరుతపులులు, ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లకు చెందిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని మాత్రం నవ్వులు పూయిస్తుంటాయి. ఇందులో ఎక్కువగా ఏనుగులకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ నవ్వులు తెప్పిస్తాయి. అలాగే మరికొన్ని ఎమోషనల్‏గానూ ఉంటాయి. తాజాగా ఓ ఏనుగు ఆకలిని తగ్గించేందుకు పనస పండు కోసం పడే తిప్పలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్ ఖాతాలో చేశారు.

అందులో ఓ ఏనుగు చెట్టు కొమ్మకు వేలాడుతున్న పనసపండును తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పనస చెట్టును కాసేపు కదిలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే తన వెనక కాళ్లపై నిలబడి తన తొండంతో పనస పండను తీసుకుంది. పండు కోసం ఏనుగు పడుతున్న శ్రమను అక్కడే ఉన్న స్థానికులు అరుస్తూ జేజేలు పలుకుతున్నారు. మనుషులకు మామిడిపండ్లు ఎలాగో.. అలాగే ఏనుగులకు జాక్ ఫ్రూట్ అలా. వీటిని పొందేందుకు విజయవంతమైన ప్రయత్నానికి మానవులు చప్పట్లు కొట్టం మనసును తాకింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఏనుగు ప్రయత్నాన్ని మీరు చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.