Viral Video: వరమాల పట్టుకుని వరుడు వెయిటింగ్.. మ్యాగీ తిన్నాకే పెళ్లంటున్న వధువు..

|

Aug 01, 2022 | 11:58 AM

తాజాగా ఓ పెళ్లికూతురు చేసిన పని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే వరుడు మండపంలో వరమాలతో వెయిట్ చేస్తుంటే మ్యాగీ తింటూ ఎంజాయ్ చేస్తూ కూర్చుంది.

Viral Video: వరమాల పట్టుకుని వరుడు వెయిటింగ్.. మ్యాగీ తిన్నాకే పెళ్లంటున్న వధువు..
Bride
Follow us on

పెళ్లి యువతీ యువకుల జీవితంలో అత్యంత ప్రత్యేకం. తమ వివాహం ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరగాలని కోరుకుంటారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు వధూవరులు చేసే పనులు చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా వచ్చకా.. పెళ్లిలో జరిగే ప్రతి చిన్న సంఘటన గుర్తుండిపోతుంది. ఇటీవల నెట్టింట్లో వివాహాలకు సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అందులో వధూవరులు చేసే అల్లరి పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ పెళ్లికూతురు చేసిన పని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే వరుడు మండపంలో వరమాలతో వెయిట్ చేస్తుంటే మ్యాగీ తింటూ ఎంజాయ్ చేస్తూ కూర్చుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

పెళ్లి తంతు జరుగుతుండగా.. వరుడు వరమాల పట్టుకుని వధువు కోసం ఎదురుచూస్తున్నాడు. ఎంతకీ ఆమె రాకపోవడంతో అతను విసిగిపోయాడు. ఇక అదే సమయంలో వధువు హ్యాప్పీగా మ్యాగీ తింటున్న వీడియో చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఓ గదిలో కూర్చుని పెళ్లికూతురు సంతోషంగా మ్యాగీ తింటుంది. అందులో వినిపిస్తున్న ఓ మహిళ వాయిస్ లో తొందరగా .. ఆలస్యం చేస్తున్నారు. పెళ్లి కూతురు మ్యాగీ తినవద్దు అని చెబుతుంది. అందుకు వధువు స్పందిస్తూ మ్యాగీ తినే సమయంలో ఎవరు డిస్టర్బ్ చేయ్యోద్దు. వరుడిని వెయిట్ చేయమని చెప్పండి అంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వధువుకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆహారం తప్ప మరేమి గుర్తులేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.