viral video: అర్ధరాత్రి సూపర్‌ మార్కెట్లోకి అనుకోని అతిథి.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! వైరలవుతున్న వీడియో

ఓ ఎలుగుబంటి సూపర్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇంకేముంది.. సూపర్‌ మార్కెట్లో తనకు నచ్చినవి వెతుక్కుని మరీ .. దొరికిన స్నాక్స్‌, స్వీట్లు, చాక్లెట్‌ బార్‌లను లాంగించేసింది.

viral video: అర్ధరాత్రి సూపర్‌ మార్కెట్లోకి అనుకోని అతిథి.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! వైరలవుతున్న  వీడియో
Hungry Bear

Updated on: Sep 20, 2022 | 5:27 PM

viral video: ఆకలితో ఉన్న ఓ ఎలుగుబంటి సూపర్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇంకేముంది.. సూపర్‌ మార్కెట్లో తనకు నచ్చినవి వెతుక్కుని మరీ .. దొరికిన స్నాక్స్‌, స్వీట్లు, చాక్లెట్‌ బార్‌లను లాంగించేసింది. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని ఒలింపిక్‌ వ్యాలీలో 7- ఎలెవెన్‌ స్టోర్‌లోకి ప్రవేశించింది ఓ ఎలుగుబంటి. ఇదంతా అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డైంది. సెప్టెంబర్ 6న ఈ సంఘటన జరిగింది.

ఒలింపిక్ వ్యాలీలోని స్టోర్‌లో నైట్‌షిఫ్ట్‌లో పనిచేస్తున్న క్యాషియర్ క్రిస్టోఫర్ కిన్సన్ తలుపు తెరిచి చూడగా ఒక్కసారిగా అతను షాక్‌కు గురయ్యాడు. గోధుమరంగులో ఉన్న ఎలుగుబంటి అర్థరాత్రి స్నాక్స్‌ విభాగంలోకి ప్రవేశించింది. తనకు తానుగా డోర్లు ఓపెన్‌ చేసుకుంటూ..తనకు కావాల్సిన ఫుడ్‌ తీసుకుని వెళ్లింది. అదంతా చూసిన అతడు బిత్తరపోయాడు..’ఓహ్ మై గాడ్…ఈ ఎలుగుబంటి ఎంత తెలివైనది. అనుకుని ఆశ్చర్యపోయాడు.

ఇవి కూడా చదవండి

ముందుగా స్టోర్‌లోకి ప్రవేశించిన ఎలుగుబంటిని చూసి భయపడిపోయానని, అదృష్టవశాత్తు వెనుక డోర్‌ ఉండటంతో తాను తప్పించుకున్నానని చెప్పాడు. అయితే, ఎలుగుబంటి మాత్రం తనకు కావాల్సిన ఆహారం మాత్రమే తీసుకుని వెళ్లిపోయినట్టుగా చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us