Python: వామ్మో.. ఇదేమి పామురా సామీ.. కళ్లు మూసి తెరిచే లోపే చెట్టును ఎక్కేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

|

Oct 08, 2022 | 8:00 AM

ఇందులో ఒక కొండచిలువు చెట్టును తనదైన శైలిలో ఎక్కడం మనం చూడొచ్చు. ఈ వీడియోను చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే మరికొందరు భయాందోళనకు గురువుతున్నారు. విపరీతంగా కామెంట్లు, షేర్లు చేస్తూ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.

Python: వామ్మో.. ఇదేమి పామురా సామీ.. కళ్లు మూసి తెరిచే లోపే చెట్టును ఎక్కేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Python
Follow us on

పాములు, కొండచిలువలను చూస్తే ఎవరికైనా భయమే. పొరపాటున అవి తారసపడితే వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు. అంతెందుకు టీవీలు, సినిమాల్లో పాములు, కొండచిలువలను చూసి జడసుకునే వాళ్లు చాలామంది ఉంటారు. ఇక వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో క్రమం తప్పకుండా దర్శనమిస్తుంటాయి. ఇందులో పాములు, కొండచిలువలు చేసే విన్యాసాలు చూస్తే ఒక్కోసారి ఒళ్లు గగుర్పొడుస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఒక కొండచిలువు చెట్టును తనదైన శైలిలో ఎక్కడం మనం చూడొచ్చు. ఈ వీడియోను చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే మరికొందరు భయాందోళనకు గురువుతున్నారు. విపరీతంగా కామెంట్లు, షేర్లు చేస్తూ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.

చెట్టుకు చుట్టుకుని..

@ Nandan singh అనే ట్విట్టర్‌ యూజర్‌ షేర్ చేసిన ఈ వీడియోలో కొండచిలువ కళ్లు మూసి తెరిచేలోపు చెట్టుపైకి ఎక్కేసింది. కళ్లు గీత కార్మికులు ఎలా పాకుతారో.. చెట్టు బెరడును ఆధారంగా చేసుకుని పాకుతూ క్షణాల్లోనే పైకి వెళ్లింది. చెట్టుకుచుట్టూకుని పాకుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే నెటిజన్లను ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా ఈ వీడియోలో కనిపించే పాము రెటిక్యులేటెడ్ పైథాన్. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి.

ఇవి కూడా చదవండి

ఈ జాతికి చెందిన పాములు 1.5 నుంచి 6.5 మీ (4.9 నుంచి 21.3 అడుగులు) పొడవు, అలాగే 75 కిలోల వరకు బరువు ఉంటాయట. ప్రపంచంలోనే అతి పొడవైన సరీసృపాలుగా వీటికి పేరుంది. కాగా ఈ రకమైన పొడవు, బరువుతో పాములు చెట్లను ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడతాయట. అందుకే ఇలా పాకుతూ, చెట్టు బెరడును చుట్టుకుని ఈ కొండచిలువ పైకి చేరుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..