Viral Video: హాయిగా నిద్రపోతోన్న వ్యక్తి పైకెక్కిన భారీ కొండచిలువ.. ఆ తర్వాత జరిగిందిదే

|

Jul 22, 2024 | 7:21 PM

ప్రతీ ఒక్కరికి పాములంటే చచ్చేంత భయం ఉంటుంది. సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తూనే దడుసుకుంటాం. అలాంటిది పైథాన్‌ను చూస్తే.. ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైనే పోతాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరీసృపాలు జనావాసాల్లోకి తరచూ వచ్చేస్తూ..

Viral Video: హాయిగా నిద్రపోతోన్న వ్యక్తి పైకెక్కిన భారీ కొండచిలువ.. ఆ తర్వాత జరిగిందిదే
Vira Video
Follow us on

ప్రతీ ఒక్కరికి పాములంటే చచ్చేంత భయం ఉంటుంది. సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తూనే దడుసుకుంటాం. అలాంటిది పైథాన్‌ను చూస్తే.. ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైనే పోతాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరీసృపాలు జనావాసాల్లోకి తరచూ వచ్చేస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా ఇంటర్నెట్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి హాయిగా నిద్రపోతుంటే.. ఏకంగా భారీ పైథాన్ ఒకటి అతడిపైకెక్కి గట్టి షాకిచ్చింది.

‘danilson_batista’ అనే ఇన్‌స్టా హ్యాండిల్ ఈ వీడియోను నెట్టింట షేర్ చేసింది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి హాయిగా తన ఇంట్లో నేలపై పరుపు వేసుకుని పడుకుని ఉండగా.. బయట నుంచి ఓ భారీ కొండచిలువ అనూహ్యంగా గదిలోకి ప్రవేశించింది. అంతటితో ఆగకుండా.. ఆ వ్యక్తి పైకెక్కి బెదరగొట్టింది. మాంచి నిద్రలో ఉన్న ఆ వ్యక్తి తన దగ్గరలో ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. కళ్లు తెరిచి చూడగా.. భారీ కొండచిలువ కనిపించింది. ఒక్క క్షణంలో తన కళ్ల ముందు ఏముందో గమనించి.. దెబ్బకు అతడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి పరిగెత్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి లక్షల్లో వ్యూస్ వస్తుండగా.. వేలల్లో లైకులు కొడుతున్నారు నెటిజన్లు. ‘అసలు ఈ వీడియో నిజమేనా’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నిద్ర లేచిన వ్యక్తికి ఇంతకన్నా భయంకరమైన అనుభవం మరొకటి ఉండదు’ అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

ఇది చదవండి: అప్పుడేమో రౌడీ బేబీ.. ఇప్పుడేమో వయ్యారాల నాటీ.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి