అప్పుడప్పుడూ మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. కొన్ని చిత్రాలు చూసేందుకు ఎంతో కళాత్మకంగా ఉన్నప్పటికీ.. వాటిల్లో పైకి కనిపించేవి అంతా భ్రమ మాత్రమే. వాటి నిజమైన రూపాలు వేరేగా ఉంటాయి. ఇలా ప్రతీ ఒక్కరిని గందరగోళానికి గురి చేసే ఈ చిత్రాలను ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు అని అంటారు. వీటిని సైకాలజిస్టులు ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సవాళ్లంటే ఇష్టపడేవారు.. తాము చేసే ప్రతీ పనిలోనూ థ్రిల్ ఫీల్ అవుతారు. ప్రతీ విషయాన్ని ఓ సవాల్‌గా ఎదుర్కుంటారు. ఇక వీరికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎదురైతే.. తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ చిత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని సాల్వ్ చేసేందుకు.. చేధించేందుకు చాలామంది ట్రై చేస్తున్నారు. కానీ 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు.
Find The Faces In This Viral Picture @WhatsTrending @TrendingWeibo @the_viralvideos @itsgoneviraI #Trending #Viral pic.twitter.com/f9cJzDilmT
— telugufunworld (@telugufunworld) April 13, 2022
పైన పేర్కొన్న ఫోటోను చూస్తుంటే.. ముందుగా మీకేం అనిపిస్తోంది. ఓ పర్వత శిఖరం.. ఇద్దరు వ్యక్తులు గుర్రాలపై స్వారీ చేస్తున్నట్లుగా ఉంది కదూ! కరెక్టే.. అలాగే కనిపిస్తోంది. కానీ అందులో దాగున్నది వేరు. మొత్తం 13 ముఖాలు ఈ ఫోటోలో దాగున్నాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని బెవ్ డూలిటిల్ అనే వ్యక్తిత్వవేత్త సృష్టించగా.. ఇది ‘ది ఫారెస్ట్ హాజ్ ఐస్'(The Forest Has Eyes) పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది.
Four Faces You Will Find Easily.. pic.twitter.com/Oz4lQnZHEk
— telugufunworld (@telugufunworld) April 13, 2022
మొదటిగా మీరు నాలుగు ముఖాలను ఈజీగా కనిపెట్టగలరు. మరి మిగతా 9 ముఖాలు ఎక్కడున్నాయి. మీ కళ్లకు కాస్త పదును పెట్టండి.. ఒక్కసారి ట్రై చేయండి.. గుర్తిస్తే ఫర్లేదు.. ఒకవేళ మీకు దొరక్కపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి..
Here are the final ones… pic.twitter.com/MIcwcyFsQT
— telugufunworld (@telugufunworld) April 13, 2022