
ఇంట్లో పనిచేసేవారు అంటే పాపం.. పేదవారు అనే ఆలోచన మనలో ఉంటుంది. కానీ, ఒక ఇంటి పని మనిషి ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె సాధించిన ఆర్థిక విజయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంటెంట్ క్రియేటర్ నళిని ఉనగర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. నళిని పోస్ట్ ప్రకారం.. తన పని మనిషి సూరత్‌లో ఏకంగా రూ. 60 లక్షల విలువైన 3BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఇందులో ఫర్నిచర్ కోసం మరో రూ. 4 లక్షలు ఖర్చు చేసింది. అయితే ఆమె కేవలం రూ. 10 లక్షలు మాత్రమే లోన్ తీసుకుంది. అంటే ఆమె తన సొంత డబ్బు రూ. 54 లక్షలు కట్టిందన్నమాట. ఇది విని షాక్ అయినట్లు నళిని తెలిపారు.
ఇంకా గొప్ప విషయం ఏమిటంటే.. ఈ ఫ్లాట్ కాకుండా ఆమెకు ఇప్పటికే రెండు అంతస్తుల ఇల్లు, ఒక షాపు కూడా ఉన్నాయట. వాటిని అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదిస్తోంది. ఈ విషయం తెలిశాక నళిని నోరు మెదపకుండా కూర్చున్నాను అని చెప్పారు. అనవసర ఖర్చులు పెట్టకుండా, తెలివిగా డబ్బు ఆదా చేయడం వల్లే ఇది సాధ్యమైందని నళిని అన్నారు. అందుకే దీనిని ఆమె స్మార్ట్ సేవింగ్ మ్యాజిక్ అన్నారు.
చాలా మంది నెటిజన్లు ఆ పని మనిషి పొదుపు అలవాటును మెచ్చుకున్నారు. కొందరు “రూ. 60 లక్షలకు 3BHK దొరకడం ఎలా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొందరు ఇది పన్ను కట్టని డబ్బు మాయాజాలం కావచ్చు అని అనుమానించారు. “ఎవరైనా అభివృద్ధి చెందితే మీరు ఎందుకు సంతోషంగా లేరు..? అని ఒక యూజర్ నళినిని ప్రశ్నించారు. దీనికి నళిని స్పందిస్తూ.. “ఆమె పట్ల నేను సంతోషంగానే ఉన్నాను. కానీ సమాజంలో అటువంటి ఉద్యోగాలలో ఉన్నవారు పేదవారనే మనస్తత్వం ఉందని సమాధానమిచ్చారు. ఏది ఏమైనా అనవసరమైన వాటికి వృధా చేయకుండా, తెలివిగా ఆస్తులు సంపాదించుకోవచ్చు అని ఈ సంఘటన రుజువు చేసింది.
My house help came in today looking really happy. She told me she just bought a 3BHK flat in Surat worth ₹60 lakhs, spent ₹4 lakh on furniture and took only a ₹10 lakh loan. I was honestly shocked.
When I asked more, she mentioned that she already owns a two-floor house and a… pic.twitter.com/OWAPW99F46— Nalini Unagar (@NalinisKitchen) October 7, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..