Horrific video: కొంతమంది క్రూర జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.. జంతువులపై దాడి చేసి పైశాచికానందం పొందుతున్నారు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియదు కానీ.. అలాంటి వారిని చూసి సభ్యసమాజమే తలదించుకుంటోంది. తాజాగా వీధిలో పడుకొని ఉన్న వీధి కుక్కలపై ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లాడు. ఈ భయానక వీడియో ఫుటేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) గా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ దారుణ సంఘటన గత బుధవారం రాష్ట్ర రాజధాని బెంగళూరులోని రెసిడెన్షియల్ కాలనీలో చోటుచేసుకుంది. రోడ్డు అంచున ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్న వీధికుక్కలపై తెలుపు రంగు ఆడి డ్రైవర్ దూసుకెళ్లాడు. కావాలని తన కారును వెనక్కి వెళ్లనిచ్చి ఒక్కసారిగా నిద్రిస్తున్న కుక్కపై ఉద్దేశ్యపూర్వకంగానే దూసుకెళ్లాడు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఘటన అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అందులో ఒక కుక్కకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆడి డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు సోషల్ మీడియా (Social Media) లో డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
వీడియో..
#Bengaluru:High on money, the grandson of a former businessman-politician drives his #Audi on a sleeping stray #dog in Jayanagar. Complaint lodged with Siddapura police.
But will cops act?@NammaBengaluroo @WFRising @BLRrocKS @WeAreBangalore @ShyamSPrasad @peakbengaluru pic.twitter.com/W02otaehZE
— Rakesh Prakash (@rakeshprakash1) January 31, 2022
Also Read: