Viral Video: ఇది కదా మానవత్వం అంటే.. తనకే ఎవరో సాయం చేస్తే.. ఆ డబ్బుతో ఆమె మరొకరికి సాయం చేసింది

కొందరు మాత్రం సమయానికి అనుగుణంగా స్పందిస్తూ.. బాధితులకు తమకు తోచిన సాయాన్ని అందిస్తారు. ఇలాంటి వీడియోలు చూస్తే..  ఇంకా మానవత్వం మిగిలి ఉందని అనిపిస్తుంది. ప్రస్తుతం మానవత్వానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఇది కదా మానవత్వం అంటే.. తనకే ఎవరో సాయం చేస్తే.. ఆ డబ్బుతో ఆమె మరొకరికి సాయం చేసింది
Heart Touching Video]

Updated on: Dec 14, 2022 | 8:35 PM

మానవత్వం కంటే పెద్ద మతంలేదు..  మానవ సేవ కంటే గొప్ప ఆరాధన లేదు.. అందుకే మనిషి తనలోని మానవత్వాన్ని ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకోవడం ముఖ్యం. అయితే నేటి కాలంలో మానవత్వం చాలా తక్కువ మందిలో మాత్రమే కనిపిస్తోంది. ప్రజలు కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి అంతగా ఇష్టపడడం లేదు. ఎవరికీ వారే జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే.. అతనికి సహాయం చేయడానికి బదులుగా.. అతనిని వీడియోలు తీస్తూ ఉంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. కొంతమందిని అలానే వినోదం చూస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం సమయానికి అనుగుణంగా స్పందిస్తూ.. బాధితులకు తమకు తోచిన సాయాన్ని అందిస్తారు. ఇలాంటి వీడియోలు చూస్తే..  ఇంకా మానవత్వం మిగిలి ఉందని అనిపిస్తుంది. ప్రస్తుతం మానవత్వానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా భావోద్వేగానికి గురవుతారు.

నిరాశ్రయులైన మహిళ చేతిలో చిన్న పోస్టర్‌తో రోడ్డుపక్కన విచారంగా కూర్చోవడం వీడియోలో మీరు చూడవచ్చు. తన పోస్టర్‌పై నిరాశ్రయురాలిని అని రాసి ఉంది. చాలా మంది ఆ యువతికి కొంత డబ్బు ఇచ్చి సహాయం చేశారు. ఇంతలో.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి తన సమస్యలను ఆమెకు వివరించాడు.. అప్పుడు ఆ స్త్రీ తన బాధను సమస్యను మరచిపోయి అతనికి డబ్బు ఇచ్చి సహాయం చేసింది. అయితే అందుకు ప్రతిగా సదరు వ్యక్తి సీల్డ్ కవరును మహిళకు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ మహిళ ఆ కవరు తెరిచి చూడగానే అందులో కొన్ని నోట్లు ఉన్నాయి. అది చూసి ఉద్వేగానికి లోనైన ఆ మహిళ తన స్థలం నుండి లేచి.. ఆ యువకుడికి వద్దకు పరుగుపరుగున వెళ్లి.. కృతజ్ఞతలు తెలిపింది. తనకు సాయం చేసిన వ్యక్తికి ధన్యవాదాలు కూడా చెప్పింది.

 

మనసుకు హత్తుకునే వీడియో @Gulzar_sahab అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. ఈ యువతి మనసు గెలుచుకుంది అనే క్యాప్షన్ తో వీడియో షేర్ చేశారు. కేవలం 49 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 56 వేలకు పైగా వీక్షించగా, 5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్లు కూడా చేశారు. ఇది హృదయానికి హత్తుకునే వీడియో అని ప్రజలు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..