అప్పుగా మద్యం అడిగిన హోంగార్డు.. ఇవ్వకపోవడంతో దుకాణానికే నిప్పు పెట్టాడు..షాకింగ్‌ వీడియో వైరల్‌

తనకు మద్యం దొరకకపోవడంతో ఏకంగా మద్యం దుకాణానికి నిప్పంటించాడు. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డైంది. వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అయితే, మంటలను సకాలంలో నియంత్రించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు నిందితుడైన హోంగార్డును అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అప్పుగా మద్యం అడిగిన హోంగార్డు.. ఇవ్వకపోవడంతో దుకాణానికే నిప్పు పెట్టాడు..షాకింగ్‌ వీడియో వైరల్‌
Homeguard Set Fire On Liquor Shop

Updated on: Sep 08, 2025 | 7:06 PM

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. డయల్ 112లో పోస్ట్ చేసిన ఒక హోంగార్డు తనకు మద్యం దొరకకపోవడంతో ఏకంగా మద్యం దుకాణానికి నిప్పంటించాడు. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డైంది. వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అయితే, మంటలను సకాలంలో నియంత్రించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు నిందితుడైన హోంగార్డును అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ సంఘటన మీరట్‌లోని దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం ప్రకారం, శనివారం రాత్రి హోమ్ గార్డ్ కపిల్ ఇంగ్లీష్ మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ తాను సేల్స్‌మ్యాన్‌ను అప్పుగా మద్యం అడిగాడు. కానీ, సేల్స్‌మ్యాన్ అలా అప్పుగా ఇవ్వడానికి కుదరదని నిరాకరించాడు. దాంతో కోపం తెచ్చుకున్న కపిల్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత అతను మళ్ళీ తిరిగి వచ్చి తాను తెచ్చుకున్న బాటిల్ నుండి మండే పదార్థాన్ని తీసి దుకాణానికి నిప్పంటించాడు.

ఇవి కూడా చదవండి

సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు ఖాకీ రంగు ప్యాంటు, నల్లటి చొక్కా ధరించి, ముఖానికి టవల్ కప్పుకుని ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అతను దుకాణం బయట చుట్టూ చూసి, మండే పదార్థాన్ని పోసి నిప్పంటించాడు. అదృష్టవశాత్తూ ప్రజలు సకాలంలో మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రమాద తీవ్ర తగ్గింది. సంఘటన తర్వాత, మద్యం దుకాణ యజమాని సదరు హోమ్ గార్డ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సత్వర చర్యలు తీసుకుని కపిల్ ను అరెస్టు చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

వైరల్ అయిన ఫుటేజ్‌ను పరిశీలించామని, అందులో నిందితుడు కపిల్‌ను హోమ్ గార్డ్‌గా గుర్తించామని మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ తెలిపారు. విచారణలో తనకు మద్యం లభించకపోవడంతో కోపం వచ్చి దహనం చేశానని కపిల్ అంగీకరించాడు. పోలీసులు కపిల్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..