Heaviest Python: పైథాన్‌లు (కొండ చిలువలు) ఎక్కువగా నీటి ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా అడవుల్లో నివసిస్తూ జంతువులను మింగి వాటి ఆకలిని తీర్చుకుంటాయి. తాజాగా.. ఓ భారీ కొండచిలువను పరిశోధకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. అతిపెద్ద బర్మీస్ పైథాన్ (కొండచిలువ) ను యూఎస్ పరిశోధకులు ఫ్లోరిడాలో స్వాధీనం చేసుకున్నారు. ఇది 18 అడుగుల పొడవు.. 98 కిలోల బరువున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఫ్లోరిడాలో ఇప్పటివరకు పట్టుబడిన అత్యంత బరువైన బర్మీస్ కొండచిలువ ఇదేనంటూ జీవశాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఆడ కొండచిలువ 215 పౌండ్లు (98 కిలోగ్రాములు), దాదాపు 18 అడుగుల పొడవు (5 మీటర్లు) ఉండటంతోపాటు.. దాని లోపల 122 గుడ్లు ఉన్నట్లు కన్జర్వెన్సీ ఆఫ్ సౌత్‌వెస్ట్ ఫ్లోరిడాకు చెందిన మీడియా తెలిపింది. ఇది ఇప్పటివరకు కనిపించిన అతిపెద్ద కొండచిలువ అని పరిశోధకులు తెలిపారు.
అయితే.. ఈ కొండచిలువ అప్పటికే చనిపోయి ఉన్నట్లు తెలిపారు. చివరిసరిగా అది జింకను వేటాడి తిన్నట్లు గుర్తించారు. తదుపరి పరిశోధనల కోసం.. చనిపోయిన పైథాన్‌కు శవపరీక్ష నిర్వహించారు. పైథాన్ కదలికలు, సంతానోత్పత్తి, నివాస వినియోగాన్ని అధ్యయనం చేయడానికి మగ “స్కౌట్” పాములలో మార్పిడి చేసిన రేడియో ట్రాన్స్‌మిటర్‌లను బృందం ఉపయోగించిందని వన్యప్రాణి జీవశాస్త్రవేత్త, కన్సర్వెన్సీ ప్రోగ్రామ్ కోసం ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇయాన్ బార్టోస్జెక్ చెప్పారు.
బర్మీస్ పైథాన్స్ ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి. ఇవి ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి అత్యంత ప్రమాదకర పాములుగా పేర్కొంటున్నారు.
“Look at the scale of the problem” – some 18 feet of very dead invasive python – the largest ever removed from Florida, complete with 120 eggs and adult white-tailed deer hooves – at @ConservancySWFL, which is working to remove them from the Everglades. pic.twitter.com/Zm0xHsZqlb
— Amy Bennett Williams (@AmySWFL) June 22, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..