Video: తండ్రి-కూతుళ్ల ప్రేమ ఆకాశమంత.. ఈ వీడియో చూస్తే 5 స్టార్ ఇచ్చేస్తారు..!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఓ తండ్రి తన కూతుళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది కేవలం ఒక డ్యాన్స్ వీడియో మాత్రమే కాదు, తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ హృదయపూర్వక వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ, భావోద్వేగాలను పంచుకోవడానికి ప్రేరేపిస్తోంది.

Video: తండ్రి-కూతుళ్ల ప్రేమ ఆకాశమంత.. ఈ వీడియో చూస్తే 5 స్టార్ ఇచ్చేస్తారు..!
Viral Father Daughter Dance

Updated on: Oct 03, 2025 | 5:01 PM

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మన జీవితాల్లో అంతర్భాగంగా మారింది. ప్రతిరోజూ వివిధ వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు వాటిని చూసి ఆనందించడమే కాకుండా ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఒక తండ్రి తన కూతుళ్లతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్నట్లు చూపించే అలాంటి ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ వీడియో చూసిన వెంటనే అదో జస్ట్‌ డ్యాన్స్‌ వీడియోల అనిపించవచ్చు. కానీ నిశితంగా పరిశీలిస్తే అది డ్యాన్స్‌ కంటే ఎక్కువ. తండ్రి కూతుర్ల అనుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రేమ, ఆప్యాయత, స్నేహం ప్రత్యేకమైన సమ్మేళనం. అందుకే ఆ వీడియో జనాల్ని అంతగా ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోలో ఓ తండ్రి రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. తమ తండ్రికి ఎంతో ప్రేమగా ఇద్దరు కూతుర్లు డ్యాన్స్‌తో స్వాగతం పలుకుతారు. కూతుర్ల ఉత్సాహం చూసి.. మురిసిపోతూ తండ్రి కూడా వారితో కలిసి సంతోషంగా స్టెప్పులేస్తాడు. వీడియో చూసేందుకు సాధారణంగానే ఉన్నా.. చూస్తుంటే మాత్రం ఏదో తెలియని హాయి, సంతోషం కలుగుతుందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మీరు కూడా కిందున్న వీడియో చూసేయండి.

మరిన్ని ‍ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి