పూర్తిగా ఆన్‌లైన్‌లో తరగతులను పూర్తి చేసుకున్న 2021 బ్యాచ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆ ప్రైవేట్ బ్యాంక్ ఇచ్చిన ప్రకటన ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. 2021 బ్యాచ్‌కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ ఉద్యోగాలకు అనర్హులు అంటూ ఇచ్చిన ఆ ప్రకటన విద్యార్థల్లో ఒక్కసారిగా అలజడి రేపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మధురైలో బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటన జారీ చేసింది. అయితే దీని కోసం జారీ చేసిన ప్రకటనలో 2021 బ్యాచ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అనర్హులు అంటూ అందులో పేర్కొంది. దీంతో ఆ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే దీనిని గమనించిన సదురు బ్యాంకు ప్రకటన జారీలో తప్పుదొర్లినట్టు వివరణ ఇచ్చుకుంది. అక్షర దోషం వల్ల అలా జరిగిందని, సవరణతో తిరిగి ప్రకటన జారీ చేసినట్టు ఆ బ్యాంకు వర్గాలు తెలిపాయి. విద్యా సంవత్సరం పూర్తి చేసిన ఏడాదితో సంబంధం లేకుండా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 28 ఏళ్లలోపు ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. అయితే, ఆ వివరణ ఇచ్చేలోపే సదురు ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా బ్యాచ్ మీమ్స్‌తో సోషల్ మీడియా హోరెత్తింది.
Read this also: Madhya pradesh Rains: మధ్యప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. చూస్తుండగానే కొట్టుకుపోయిన భారీ వంతెన.. షాకింగ్ వీడియో మీకోసం..
Rare Coins: ఈ మూడు కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా?.. ఉంటే రూ. 20 లక్షల మీసోంతం.. అదెలాగంటే..