India First AI Teacher Robot: పాఠాలు చెప్పే ఏఐ రోబో టీచర్ ను చూశారా.. వీడియో చూస్తే షాక్ అవ్వడం ఖాయం

|

Mar 06, 2024 | 8:18 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ చర్చనీయాంశమవుతోంది. సినిమా, మీడియా, అగ్రికల్చర్, హోటల్ ప్రతి సెక్టార్ లో ఏఐ ముద్ర కనిపిస్తోంది. ఏఐ ఇంట్రడ్యూస్ అయ్యింది ఎప్పుడో అయినప్పటికీ, రష్మిక డీప్ ఫేక్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పట్నుంచీ ఈ టెక్నాలజీ గురించి చాలామంది తెలిసిందే.

India First AI Teacher Robot: పాఠాలు చెప్పే ఏఐ రోబో టీచర్ ను చూశారా.. వీడియో చూస్తే షాక్ అవ్వడం ఖాయం
Ai Teacher
Follow us on

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ చర్చనీయాంశమవుతోంది. సినిమా, మీడియా, అగ్రికల్చర్, హోటల్ ప్రతి సెక్టార్ లో ఏఐ ముద్ర కనిపిస్తోంది. ఏఐ ఇంట్రడ్యూస్ అయ్యింది ఎప్పుడో అయినప్పటికీ, రష్మిక డీప్ ఫేక్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పట్నుంచీ ఈ టెక్నాలజీ గురించి చాలామంది తెలిసిందే. ఇప్పటికే పలు రంగాల్లో ఏఐ సేవలు ఉన్నప్పటికీ తాజాగా ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఏఐ ప్రత్యేకత కనిపిస్తోంది. తాజాగా కేరళలో ఏఐ టీచర్ రోబో పాఠాలు చెప్పి విద్యార్థులను ఆశ్చర్యపర్చింది. రోబో టీచర్ ను కలిసిన తర్వాత విద్యార్థుల మాదిరిగానే అందరూ షాక్ అవుతున్నారు!

అచ్చం టీచర్  మాదిరిలా చీర కట్టుకొని పిల్లలకు పాఠాలు చెప్పింది. అంతేకాదు.. విద్యార్థుల దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి తనను తాను పరిచయం చేసుకుంది. విద్యార్థులతో ఏఐ సంభాషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది నుంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ ఈ వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘విద్యలో హద్దులు దాటడం, భారతదేశపు తొలి ఏఐ టీచర్ రోబో ను పరిచయం’ అనే క్యాప్షన్స్ తో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ టీచర్ రోబో భలే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

భారతదేశంలో ఐరిస్ అనే ఏఐ రోబో టీచర్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. లేడీ టీచర్ మాదిరిగా క్లాసులో మాట్లాడుతున్న వీడియోను ఆన్ లైన్ లో షేర్ చేశారు. తిరువనంతపురంలోని కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఐరిస్ రోబోను గత నెలలో ఇంట్రడ్యూస్ చేశారు. తంగల్ చారిటబుల్ ట్రస్ట్, మేకర్ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఏఐ రోబో టీచర్ సేవలను అందిస్తోంది. నీతి ఆయోగ్ కు చెందిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్ ) ప్రాజెక్టు కింద ఏఐ రోబోను రూపొందించారు. పాఠశాల విద్యార్థులకు ‘ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్’ను ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.