పెళ్లి ఊరేగింపులో గాల్లోకి కరెన్సీ నోట్‌లు.. ఎగబడ్డ జనాలు! అంతలో ఊహించని సీన్..

ఆ ఊర్లో హుషారుగా పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. వధువరులను ఊరేగిస్తూ కోలాహలంగా ఉంది అక్కడి వాతావరణం. ఇంతలో కొందరు వ్యక్తులు గాల్లోకి కరెన్సీ నోట్లు విసిరారు. గ్రామంలోని పిల్లలతోపాటు పెద్దలు కూడా వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. అయితే అంతలో అనుకోని పెను విషాదం జరిగింది. దీంతో పెళ్లి తంతు ఆగిపోయింది. అసలేం జరిగిందంటే..

పెళ్లి ఊరేగింపులో గాల్లోకి కరెన్సీ నోట్‌లు.. ఎగబడ్డ జనాలు! అంతలో ఊహించని సీన్..
Haryana Wedding Incident

Updated on: Mar 07, 2025 | 7:44 PM

లక్నో, మార్చి 7: ఓ పెళ్లి ఊరేగింపు నిరుపేద బాలుడి నిండు ప్రాణాలు తీసింది. ఊరేగింపులో భాగంగా కరెన్సీ నోట్‌లు గాల్లోకి వెదజల్లడంతో.. కటిక పేదరికంలో మగ్గుతున్న ఓ బాలుగు వాటిని ఏరుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో భవనంపై కొన్ని నోట్లు పడటంతో వాటి కోసం అక్కడికి వెళ్లి విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌ జిల్లా లో శుక్రవారం (మార్చి 7) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హర్యాణాలోని సోనిపట్‌ జిల్లాలోని రోహతక్‌ పట్టణం తాజ్‌పూర్‌ గ్రామంలో గురువారం రాత్రి ఓ పెళ్లి ఊరేగింపు జరిగింది. రోహ్‌తక్ నుండి వివాహ ఊరేగింపు వచ్చింది. ఈ ఊరేగింపు తాజ్‌పూర్‌లోని ఫామ్‌ హౌజ్‌కు చేరుకోగానే పెళ్లికి వచ్చిన అతిథులు ఆనందంలో గాల్లోకి కరెన్సీ నోట్లు వెదజల్లారు. ఆ నోట్‌లను ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడు కూడా కరెన్సీ నోట్‌ల కోసం వెళ్లాడు. అయితే ఫామ్‌ హౌస్‌ పైన పడిన నోట్ల కోసం పైకి వెళ్లాడు. అయితే అక్కడ హైటెన్షన్‌ విద్యుత్ వైర్‌ ప్రమాదశశాత్తు బాలుడికి తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. దీంతో అందరూ చూస్తుండగానే బాలుడు మంటల్లో కాలిపోయాడు.

ఈ హఠాత్పరిణామానికి పెళ్లికి వచ్చిన వారంతా షాక్‌కు గురయ్యారు. బాలుడు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులు రోజు వారీ కూలీలు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.