రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది.. ముచ్చటగా మూడో ప్రయత్నంతో ఎక్కడికో వెళ్లిపోయాడు..!

అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు కూడా ఇలాంటి అదృష్టం మీద విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఇప్పుడు అలాంటిదే ఒక అద్భుత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబాన్ని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. వారిని రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చేసింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషం నిండిపోయింది. ఊరు ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది.. ముచ్చటగా మూడో ప్రయత్నంతో ఎక్కడికో వెళ్లిపోయాడు..!
Haryana Drivers

Updated on: Jan 20, 2026 | 12:22 PM

అదృష్టం బాగుండాలే గానీ, మట్టిని ముట్టుకున్నా అది బంగారం అవుతుందని అంటారు..అంటే ప్రజల్లో అదృష్టం పట్ల అంత నమ్మకం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగానే అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు కూడా ఇలాంటి అదృష్టం మీద విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఇప్పుడు అలాంటిదే ఒక అద్భుత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబాన్ని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. వారిని రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చేసింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషం నిండిపోయింది. ఊరు ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని సిర్సాలో నివసించే పృథ్వీ సింగ్ డ్రైవర్‌గా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాత్రి పగలు డ్రైవింగ్ చేస్తూ చాలీ చాలనీ డబ్బులతో పిల్లలను పోషించే పృథ్వీ సింగ్, పంజాబ్ స్టేట్ డియర్ లాటరీ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ 2026లో మొదటి బహుమతి రూ.10 కోట్లను గెలుచుకున్నాడు. దీంతో పృథ్వీ సింగ్ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంది. గ్రామంలో సందడి వాతావరణం కనిపించింది. మనలో ఒకడికి అదృష్టలక్ష్మి తలుపు తట్టిందంటూ సంబరాలు చేసుకున్నారు సిర్సా జిల్లాలోని ముహమ్మద్‌పురియా గ్రామస్థులు.

35 ఏళ్ల పృథ్వీ సింగ్‌ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి, సోదరుడు ఉన్నారు. భార్య సుమన్‌ రాణి పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తుండగా.. తండ్రి దేవీలాల్‌ డ్రైవర్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు సార్లు లాటరీ టికెట్‌ కొని నిరాశపడ్డ పృథ్వీ సింగ్‌…మూడో ప్రయత్నంలో రూ. 500కి టికెట్ కొనుగోలు చేశానని చెప్పాడు. అతని టికెట్ నంబర్ 327706. తనకు దక్కిన ఈ అదృష్టంపై సంతోషం వ్యక్తంచేశాడు. లాటరీ రూపంలో వచ్చిన నగదును పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తానని చెప్పాడు. వచ్చిన డబ్బులతో లగ్జరీ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు తన కోరికను బయటపెట్టాడు పృథ్వీ ఆరేళ్ల కుమారుడు దక్ష్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..