Trending: నది ఒడ్డున కనిపించిన షాకింగ్ దృశ్యం.. గగుర్పాటుకు గురైన జనం.. మీరూ చూడండి

|

Jun 10, 2022 | 6:23 PM

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో అనేకవాటిల్లో కొన్ని చేపలకు సంబంధించినవి కూడా ఉంటాయి. అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన చేపలు నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. తాజాగా మరో చేప నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

Trending: నది ఒడ్డున కనిపించిన షాకింగ్ దృశ్యం.. గగుర్పాటుకు గురైన జనం.. మీరూ చూడండి
Half Sliced Shark
Follow us on

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో అనేకవాటిల్లో కొన్ని చేపలకు సంబంధించినవి కూడా ఉంటాయి. అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన చేపలు నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. తాజాగా మరో చేప నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. చేప అంటే అది చేపకాదుమరీ, షార్క్‌ఫిష్‌. దాన్ని చూసిన నెటిజనం బుర్రలు హీటెక్కిపోతున్నాయి. అదేంట్రా బాబు అనుకుంటూ ఇంటర్‌నెట్‌ వేదికగా ఓ పెద్ద చర్చనే సాగిస్తున్నారు. కామెంట్ల మీద కామెంట్లు, డౌట్ల మీద డౌట్లు, ఒకరి డౌట్‌కి మరోకరి సమాధానంతో సోషల్ మీడియా వినియోగదారులు ఈ షార్క్‌ఫిష్‌పై తీవ్రంగా సంభాషించుకుంటున్నారు. అసలు సంగతి ఎంటనే వివరాల్లోకి వెళితే…

ఓ బీచ్‌లో సగం కోసిన షార్క్ ఒకటి కనిపించింది. దాన్ని ఫోటో తీసిన స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఫోటో చూసిన జనం ఇదేలా జరిగిందంటూ చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఈ ఫోటోలో సగానికి తెగిన షార్క్‌ఫిష్‌ కెనడాలోని ఓ బీచ్‌లో కుళ్లిపోయిన స్థితిలో కనిపించినట్టు గుర్తించారు.ఇదే ఫోటో ఇంటర్నెట్‌లో షేర్ చేయబడింది. ఈ ఫోటోపైనే నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఎంత దారుణం అంటూ తీవ్రంగా ఖండిస్తున్నారు. మరికొందరు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో కామెంట్స్‌ చేశారు. షార్క్‌ ఇంత భయంకరమైన మరణానికి కారణం ఏంటా అని ఆరా తీసేలా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి ఫోటోను పోస్ట్ చేసినట్లు చెప్పబడిన రెడ్డిట్ వినియోగదారు ఓక్ ఐలాండ్‌లోని బీచ్‌లో ఇలాంటి షార్క్‌ఫిష్‌ని చూసినట్టు చెప్పారు. దాన్ని ఎవరు ఎందుకు సగానికి కట్‌చేశారో తెలియక షాక్‌కు గురైనట్టు చెప్పారు. ఫోటోలోని షార్క్ “అట్లాంటిక్ షార్ప్‌నోస్” అని ఒక వినియోగదారు అంచనా వేశారు. అతను అలా ఎందుకు నమ్ముతున్నాడో కూడా వివరించాడు. అట్లాంటిక్‌ షార్ఫ్‌నోస్‌ లు ముక్కు ఆకారం కలిగి, తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరొక వినియోగదారు స్పందిస్తూ..ఏదో పెద్ద జంతువు దీనిపై దాడి చేసి ఉంటుందని అన్నారు. లేదంటే, ఏదైన షిప్‌, పడవలాంటిది ఢీకొట్టడంతో ఈ షార్క్‌ రెండు ముక్కలుగా అయి ఉండవచ్చని భావించారు. మరొకరు ఇది పడవ ప్రమాదం కాదు, ఇది ఏ ప్రొపెల్లర్ కాదు. ఇది ఏ పగడపు దిబ్బ కాదు. ఇది జాక్ ది రిప్పర్ కాదు, మరొకరు పోటీగా కామెంట్స్‌ చేశారు. అట్లాంటిక్‌ షార్ఫ్‌నోస్‌లు ఖచ్చితంగా తెల్లగా ఉండవు కానీ ఇతర సొరచేపలు తినే అనేక సొరచేపలను నేను చూశానని మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.ఇలా ఈ సగం తెగిపోయిన షార్క్‌ఫోటోపై నెటిజన్ల కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి